క్రేజీ పాన్ ఇండియా మూవీ ‘ బ్ర‌హ్మాస్త్ర ‘ ర‌న్ టైం లాక్‌… ఎన్ని నిమిషాలు అంటే…!

బాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకున్న‌ బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్ 9న ప్రంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా భారి స్థాయిలో విడుదలకు మేకర్స్ సిద్ధం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 5000ల స్క్రీన్ లో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రన్ టైం ని లాక్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ సినిమాకు దర్శకత్వహించిన అయాన్ ముఖర్జీ ఈ సినిమా రన్ టైంను 2గంట‌ల‌47 నిమిషాలకు లాక్ చేసినట్లు సమాచారం.ఈ సినిమా కథ ప్రకారం రన్ టైం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను బాలీవుడ్ దిగ్గజ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ వంటి పలువురు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు దేశవ్యాప్తంగా చాలా చురుగ్గా జరుగుతున్నాయి. సినిమాలో రన్బీర్ కపూర్- అలియా భట్ హీరో హీరోయిన్లు నటించారు. అమితాబచ్చన్- నాగార్జున వంటి దిగ్గ‌జ‌ నటలు ఈ సినిమాలో నటించారు.

Share post:

Latest