అభిమాని గుండెపై చెరగని ముద్ర వేసిన రష్మీక..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు పొందింది హీరోయిన్ రష్మిక. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగిస్తూ ఉన్నది ఈ ముద్దుగుమ్మ. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఉన్నది. త్వరలోనే రష్మిక నటించిన బాలీవుడ్ చిత్రం గుడ్ బై చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ నేపథ్యంలోనే రష్మిక ప్రమోషన్లలో భాగంగా పాల్గొంటూ అక్కడ ఉండే అభిమానుల హృదయాలను గెలుచుకున్నది. తన వెంటపడిన ఒక యువ అభిమాని ఛాతీ పైన రష్మిక సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ ఇస్తున్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Rashmika Mandanna: ಎದೆ ಮೇಲೆ ಆಟೋಗ್ರಾಫ್​ ಹಾಕಿ ಅಂತ ಹಠ ಹಿಡಿದ ರಶ್ಮಿಕಾ ಮಂದಣ್ಣ  ಅಭಿಮಾನಿ; ಮುಂದೇನಾಯ್ತು? | Goodbye actress Rashmika Mandanna autographs on  fan's chest: Video goes viral | TV9 Kannada
మొదట ఆ వ్యక్తి పుస్తకం పై ఆటోగ్రాఫ్ తీసుకోగా తర్వాత తన షర్టు విప్పి టీ షర్టు పైన రష్మిక ఆటోగ్రాఫ్ ఇవ్వాల్సిందిగా ఎంతో ప్రేమగా అడగడంతో అందుకు రష్మిక కాదనలేక వెంటనే అతడి గుండెలపైన సంతకం చేసింది. ఇక తనకు ఇష్టమైన హీరోయిన్ తో ఇలాంటి మధురమైన జ్ఞాపకాన్ని పంచుకోవడంతో అభిమాని గుండెల్లో ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది చెప్పవచ్చు . రష్మిక ఆటోగ్రాఫ్ తీసుకున్న ఆ అభిమాని ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. మరొకవైపు రష్మిక తన యువ అభిమాని గుండెల పై సంతకం చేసి మాట్లాడుతున్నప్పుడు చాలా ఆనందపడినట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది.

ఈ వీడియో క్షణాలలో పాపులర్ అవ్వడమే కాకుండా పలువురు నెటిజన్ల సైతం ఈ వీడియో పై స్పందిస్తూ ఉన్నారు. ఒక అభిమాని ఆమె చాలా స్వీట్ అని తెలియజేయక.. మరొక అభిమాని రష్మిక ఎప్పుడు ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఉంటుందని ఇలా పలు రకాలుగా కామెర్లు చేస్తూ ఉన్నారు. ఇక మరొకవైపు రష్మిక బాలీవుడ్ లో మిస్టర్ మజ్ను, రణబీర్ తో కలిసి ఒక సినిమాలో తమిళంలో విజయ్ సరసన ఒక సినిమాలో నటిస్తూ ఉన్నది. ఇక తెలుగులో మాత్రం పుష్ప -2 చిత్రంలో నటిస్తోంది.