చరణ్ పై జరుగుతున్న కుట్ర ..మెగా ఫ్యాన్స్ గమనిస్తున్నారా..?

స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్‌లా సినిమాలంటే అంతా ఇంతా క్రేజ్ కాదు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో సినిమా షూటింగ్ సెరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. కొంత భాగం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా. మిగిలిన భాగం షూటింగ్ ఈ నెల మొదటి వారంలో మొదలుపెట్టారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా నుంచి ఒక సాంగ్ కి సంబంధించిన షూటింగ్ వీడియోను బయటికి లీక్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన రామ్‌చరణ్ అభిమానులు బాగా బాధపడి పోతున్నారు. రామ్ చరణ్ ని ఎవరో కావాలని టార్గెట్ చేసి ఈ సినిమాకి సంబంధించిన వీడియోలను లీక్ చేస్తున్నారని ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే ఇలాంటి లీకుల వెనక తప్పే ఎవరిది అనే చర్చ ఇప్పుడు ఎక్కువగా జరుగుతోంది. దిల్ రాజ్ దా.. శంకర్ దా అనే విషయాన్ని నెటిజన్లు అడుగుతున్నారు.

Share post:

Latest