మంచు ఫ్యామిలీ లో మొదలైన ఆస్తి పంపకాలు.. అందుకేనా..?

ఆస్తి పంపకాలనేది సామాన్య ప్రజలకే కాదు సెలబ్రిటీల విషయంలో కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. ఇక తాజాగా కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు కుటుంబంలో కూడా ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి అనే వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే ఇందుకు కారణం మంచు మనోజ్.. మనోజ్ టాలీవుడ్ లో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకొని కెరియర్ ఆరంభంలో ఎన్నో బ్యూటిఫుల్ చిత్రాలలో నటించి మెప్పించాడు. ఇక ఆ తర్వాత ఆయన కెరియర్ ట్రాక్ తప్పిందని చెప్పాలి. సినిమాల సంగతి ఎలా ఉన్నా సరే ఆయన ఒక మంచి మనసున్న వ్యక్తి అని అభిమానులు ఎప్పుడు ప్రశంసిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా మంచు మనోజ్ త్వరలోనే రెండవ వివాహానికి సిద్ధమవుతున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం.Manchu family moves to Shamshabad residence | Telugu Movie News - Times of  India

తాజాగా మనోజ్ , భూమా మౌనిక రెడ్డి తో కలిసి గణేష్ పూజలో కనిపించడంతో ఈ వార్తలకు తెర లేపింది. మౌనిక తో వివాహం గురించి మంచు మనోజ్ ను మీడియా ప్రశ్నించగా.. అది తన వ్యక్తిగత విషయమని.. సమయం వచ్చినపుడు చెబుతాను అని హింట్ ఇచ్చారు. దీంతో మనోజ్, మౌనికల వివాహం ఖాయమని అంతా భావిస్తున్నారు. కానీ మౌనికతో వివాహానికి మంచు ఫ్యామిలీలో వ్యతిరేకత మొదలైనట్లు సమాచారం. మౌనికను మంచు మనోజ్ వివాహం చేసుకోవడానికి మోహన్ బాబుకు ఇష్టం లేదని ప్రచారం జరుగుతుంది. అందుకే మంచు మనోజ్ కుటుంబంతో విభేధిస్తున్నారని సమాచారం. ఇకపోతే ఇష్టం లేకపోయినా మంచు మనోజ్ బలవంతం మీద కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఇక వివాహం తర్వాత మోహన్ బాబు ఆస్తి పంపకాలు చేయడానికి నిర్ణయించుకున్నారట.Manchu Family: మంచు వారింట వినాయక చవితి వేడుకలు.. | Vinayaka Chaturthi  celebrations in Manchu Mohan Babu family pk– News18 Teluguఇప్పటికే 2015లో మనోజ్ , ప్రణీత రెడ్డిని వివాహం చేసుకొని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక భూమా మౌనిక కూడా గతంలో వివాహం చేసుకొని విడాకులు తీసుకుంది. ప్రస్తుతం వీరిద్దరు ఒకటి కాబోతున్నట్లు సమాచారం. ఇక ఆస్తిని కూడా విష్ణు మనోజ్ కి సమానంగా ఇవ్వబోతున్నాడట మోహన్ బాబు.

Share post:

Latest