ప‌వ‌న్ పోటీ కోసం ఆ 4 నియోజ‌క‌వ‌ర్గాలు… స‌ర్వేలో ఏం తేలిందంటే…!

వ‌చ్చే ఎన్నిక‌లు అన్ని పార్టీల‌కూ ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. ముఖ్యంగా.. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒక్క‌సీటు తో ప‌రిమిత‌మైన‌.. జ‌న‌సేన పార్టీకి ఈ ఎన్నిక‌లు మరింత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. ఎట్టి ప‌రిస్థితిలోనూ.. అసెంబ్లీలో అడుగు పెట్టి తీరాల‌ని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. అయితే.. ఆయ‌న ఎటు నుంచి విజ‌యం ద‌క్కించుకోవాలి? అనేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో ఏకం గా.. రెండు స్థానాల నుంచి ప‌వ‌న్ పోటీ చేశారు.

కానీ, విజ‌యం మాత్రం ద‌క్కించుకోలేక పోయారు. ఈ రెండు స్థానాల్లోనూ.. ఘోర‌మైన ప‌రాభ‌వం ఎదురైం ది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. విజ‌యం ద‌క్కించుకుని తీరాల‌నేది.. జ‌న‌సేన అధినేత నిర్ణ‌యం గా ఉంది. ఈ క్ర‌మంలో ఈ సారి నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఆయ‌న పోటీచేసే అవ‌కాశం ఉంద‌ని.. తాజాగా.. జ‌న‌సేన‌లో చ‌ర్చ సాగుతోంది. ఈ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీనా.. లేక ఎక్క‌డైనా.. భారీగా గెలిచే అవ‌కాశం ఉన్న చోట నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకోవ‌డ‌మా? అనేది యోచిస్తున్నార‌ట‌.

ప్ర‌స్తుతం జ‌న‌సేనలో ఉన్న టాక్‌ను బ‌ట్టి.. ప‌వ‌న్ నాలు గు నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో.. జ‌న‌సేన ప‌రిస్థితి ఎలా ఉంది? ఎంత ఓటు బ్యాంకు వ‌స్తుం ది? .. యువత రేంజ్ ఎలా ఉంది? వంటి కీల‌క‌మైన అంశాల‌పై స‌ర్వే కూడా చేయించార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం జ‌న‌సేన ప‌రిశీల‌న‌లో ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప‌రిశీలిస్తే.. తిరుప‌తి ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంది. ఉమ్మ డి చిత్తూరుజిల్లాలో మెగా ఫ్యాన్స్ స‌హా.. పార్టీని సానుకూల ప‌వనాలు మెండుగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం తిరుప‌తి!

సో.. ఇక్క‌డ నుంచి పోటీ చేసే అవ‌కాశం మెండుగా ఉంది. ఇక, రెండో ప్లేస్‌లో తూర్పుగోదావ‌రి జిల్లా పిఠా పురం నియోజ‌క‌వ‌ర్గం ఉంది. ఇక్క‌డ నుంచి పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్క‌డం ఈజీయేన‌ని.. జ‌న‌సేన నేత‌లు లెక్క‌లు వేసుకుంటున్నారు. మ‌రో నియోజ‌క‌వ‌ర్గం కాకినాడ రూర‌ల్‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కూడా.. కాపులు ఎక్కువ‌గా ఉండ‌డం.. మెగా ఫ్యాన్స్ అభిమానులు కూడా ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ఇక్క‌డ నుంచి పోటీ చేసినా.. ప‌వ‌న్ గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

ఇక‌, నాలుగో నియోజ‌క‌వ‌ర్గం.. విశాఖ ప‌ట్నం న‌గ‌రంలోని నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉత్త‌ర నియోజ‌కవ‌ర్గం. గ‌తంలో బీజేపీ.. 2019లో టీడీపీ విజ‌యం ద‌క్కించుకున్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ మాటే లేదు. సో.. ఇది ప‌వ‌న్‌కు అనుకూలంగా మారుతుంద‌నే అంచ‌నాలు.. జ‌న‌సేన‌లో క‌నిపిస్తున్నాయి. మొత్తానికి ఈ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ జ‌న‌సేన‌కు పాజిటివిటీ ఎక్కువ‌గా ఉంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో.. ప‌వ‌న్ ఎక్క‌డి నుంచి పోటీ చేస్తారో చూడాలి. ఈ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న ఎక్క‌డ నుంచి పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్క‌డం త‌థ్య‌మ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.