నా ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ రావలసిన అవసరం ఏముంది: మెగాస్టార్ 

తెలుగుతెర ముద్దుబిడ్డ మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా రిలీజ్ కాబోతోంది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన వస్తోంది. కాగా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేయబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమా పొలిటికల్ త్రిల్లర్ కాబట్టి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వస్తాడని పవర్ స్టార్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

ఇక మెగా అభిమానులు అయితే ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్టేజిపై కనిపించబోతున్నారు అని కలలు కన్నారు. అయితే వారి కలలు కల్లలుగానే మిగిలిపోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశాలు లేవు అని తెలుస్తోంది. అయితే ఇందుకు బలమైన కారణం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. తిరిగి ఇండియాకు దసరా తరువాత వచ్చే అవకాశాలు ఉన్నట్లు భోగట్టా.

దీంతో, గాడ్ ఫాదర్ మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ సంప్రదించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయమై మెగాస్టార్ ని అడిగితే… తమ్ముడు బిజీగా వున్నాడు ఈ సమయంలో తనని డిస్టర్బ్ చేయలేము, అయినా తాను రాకపోతే ఏంటి? నాకు మా అభిమానులు వున్నారు కదా! అని తన సన్నిహితులతో చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ లేకుండానే జరగబోతుంది అని అర్ధం అయిపోయింది. అయితే ఈ విషయంపై మెగా అభిమానులు స్పందిస్తూ అన్న చిరంజీవి పిలిస్తే పవన్ కళ్యాణ్ తప్పకుండా వస్తాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest