మరోసారి తెరపైకి ఎన్టీఆర్ గరుడ.. అన్ని రూ.కోట్ల బడ్జెట్ తో..!!

టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. మొదట వీరిద్దరి కాంబినేషన్లో స్టూడెంట్ నెంబర్-1 చిత్రం రాగ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రాజమౌళి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇక తర్వాత సింహాద్రి ,యమదొంగ, RRR సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా కూడా పేరు సంపాదించారు. ఇక రాజమౌళి సినిమాలను చూసిన హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు ఇదంతా ఇలా ఉండగా రాజమౌళి, ఎన్టీఆర్ కలయికలో ఇప్పటికే నాలుగు సినిమాలు రావడం జరిగింది. అయితే త్వరలోనే ఐదవ సినిమాకి కూడా సన్నాహాలు చేస్తున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Garuda - NTR - Home | Facebook
బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఎన్టీఆర్ తో గరుడ అనే ఒక భారీ బడ్జెట్ సినిమాని చేయాలనుకున్నారు. అయితే ఈ విషయం అప్పట్లో చాలా వైరల్ గా మారింది కానీ ఆ ప్రాజెక్టు మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు.. రాజమౌళి RRR సినిమా మల్టీస్టారర్ గా రామ్ చరణ్ ఎన్టీఆర్ ని కలిసి తెరకెక్కించగా గరుడ సినిమాని మర్చిపోయారు. దీంతో రాజమౌళి తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేయడానికి సిద్ధమైనట్లుగా అందుకు సంబంధించి ప్రాజెక్ట్ పని కూడా పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నారు రాజమౌళి.

2 heroes in race for Rajamouli's 1000 crore project Garuda after Bahubali-2  – Topcount

ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ తో గరుడ సినిమాని త్వరలోనే చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక రాజమౌళికి తారక్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తనతో కలిసి పనిచేయడం కూడా చాలా ఇష్టమని రాజమౌళి, ఎన్టీఆర్ ఎన్నో సందర్భాల్లో తెలియజేశారు. మహేష్ సినిమా తర్వాత రాజమౌళి చేసే సినిమా ఇదే అంటూ మరికొంతమంది తెలియజేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని దాదాపుగా రూ.1000 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Share post:

Latest