విదేశాల్లో 100రోజులు ఆడిన ఎన్టీఆర్ తెలుగు చిత్రం..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా కొనసాగిన ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ కేవలం హీరో మాత్రమే కాదు గొప్ప రాజకీయవేత్త కూడా.. సాంఘిక , పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో నటుడిగా నటించి తమ ప్రతిభను కనబరిచారు. ఇక అంతేకాదు ఆయన నటించే ప్రతి సినిమా కూడా దాదాపుగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని అత్యధిక పారితోషకం తీసుకున్న నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తెలుగు సినీమా ను దేశానికే కాదు విదేశాలలో కూడా గుర్తింపు వచ్చేలా చేయడం జరిగింది. ఇక అలా ఎన్టీఆర్ నటించిన ఒక చిత్రం విదేశాలలో 100 రోజులు ఆడి శత దినోత్సవం జరుపుకుంది.

Watch Malliswari | Prime Video

ఎన్టీఆర్ ఏ సినిమా అయితే చేయను అని చెప్పి చివరికి తెరకెక్కించాతో ఆ సినిమానే అరుదైన రికార్డులను నెలకొల్పి తెలుగు సత్తా మాత్రమే కాదు భారతీయ చలనచిత్ర ఖ్యాతిని ఎల్లలు దాటించింది. ఇక ఆ సినిమానే మల్లీశ్వరి. ఎన్టీఆర్ హీరోగా బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో AA పిక్చర్ బ్యానర్ లో భానుమతి హీరోయిన్గా నటించిన చిత్రం మల్లీశ్వరి. మొదట ఈ సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. కానీ ఆయనే చేయాలని నిర్మాత ఎన్టీఆర్ ను పట్టుబట్టారు. ఇక చాలా భాషల్లో ఈ ఫిలిం రిలీజ్ అయ్యి మంచి పేరును తీసుకొస్తుందని దర్శకుడు అలాగే నిర్మాత ఇద్దరూ కూడా ఎన్టీఆర్ను ఒప్పించి మరి సినిమాను తెరకెక్కించారు.

ఇక ఈ చిత్రంలో నాగరాజు పాత్రను ఎన్టీఆర్ పోషించారు. ఇక ఈ చిత్రం మన దేశంలోనే కాదు చైనాలో కూడా 100 రోజులు ఆడి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.. నిజానికి ప్రొడ్యూసర్ ఎన్టీఆర్ ఒప్పుకోకపోవడంతో ఏఎన్ఆర్ తో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ దర్శకుడు పట్టుబట్టి మరి ఎన్టీఆర్ ను ఒప్పించి ఆయన ఖాతాలో ఈ అరుదైన రికార్డును చేర్చారు. ఇక అలా అప్పట్లోనే తెలుగు సినిమా విదేశాలలో కూడా గుర్తింపును సొంతం చేసుకుంది.