తండ్రి పై ఎమోషనల్ పోస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతూ ఉన్నారు. ఇక బాలకృష్ణ ,హరికృష్ణ వంటి వారు ఎంట్రీ ఇచ్చినా బాలకృష్ణ మాత్రమే నటుడుగా ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు హరికృష్ణ నటించిన సినిమాలు ఎక్కువగా లేవు. హరికృష్ణ వారసులుగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి పేరును తీసుకొస్తున్నారు. అయితే హరికృష్ణ ఆగస్టు 29న రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఇక రాజకీయంగా కూడా హరికృష్ణ ఎంతో చురుగ్గా ఉండేవారు.Hari Krishna, Kalyan Ram and NTR multi-starrer on cardsనేడు హరికృష్ణ జయంతి కావడంతో ఆయన కుమారులు హరికృష్ణ ను గుర్తుచేసుకొని తన 66వ జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది ఈ క్రమంలోని తన తండ్రి గురించి ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్టు రాసుకోవడం జరిగింది. ఎన్టీఆర్ తన తండ్రి సందర్భంగా ఇలా ట్వీట్ చేస్తూ.. ఈ అస్తిత్వం మీరు ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగి మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు.. అజ్ఞానాంతం తలుచుకునే ఆశ్రుకణం మీరే.. అంటూ ఒక ఎమోషనల్ పోస్టు హరికృష్ణ రాసుకు వచ్చారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారుతుంది.

ఇక ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ పోస్ట్ ని కళ్యాణ్ రామ్ కూడా ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ తన తండ్రి ని గుర్తుకు చేసుకోవడం జరిగింది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ సినిమా షూటింగ్ నీ త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇక తర్వాత కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో నటించనున్నారు. RRR సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరుపొందాడు ఎన్టీఆర్.

Share post:

Latest