బాలీవుడ్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పి పాన్ ఇండియా లెవెల్లో ఛాలెంజ్ చేసిన ఎన్టీఆర్..

ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ర్టీస్ పాన్ ఇండియా లెవెల్లోనే సినిమాలు రిలీజ్ చేయాలనే ఆలోచనతోనే ఉంటున్నాయి. ఎందుకంటే ఏదైనా ఒక సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి హిట్ కొడితే వారు పెట్టినదానికి వంద రెట్లు వస్తుంది. బాహుబలి సినిమాతో ఈ విషయాన్ని తెలియచేసింది మాత్రం రాజమౌళినే. బాహుబలి పాన్ ఇండియా లెవెల్ లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. అసలు తెలుగు సినిమాలకు బాలీవుడ్ ప్రేక్షకుల లో సైతం ఇంటరెస్ట్ క్రియేట్ అవటం మొదలయ్యింది బాహుబలితోనే.

బాహుబలి తరువాత RRR , పుష్ప నుంచి మొన్నవచ్చిన కార్తికేయ 2 వరకు బాలీవుడ్ ప్రేక్షకులను మన తెలుగు సినిమాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈసినిమాలు చూసిన తరువాత బాలీవుడ్ లో వచ్చే సినిమాలు చూసి విసుగొచ్చి చివరకు బాలీవుడ్ సినిమాలను బొయికాట్ చేసే స్థాయికి వారిలో అసహనం పెరిగిపోయింది. చివరికి బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ చేయాలంటేనే భయపడే స్థాయికి వెళ్లిపోయారు బాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు. అయితే బాలీవుడ్ ప్రేక్షకులను శాంతిపర్చే సమాధానం బాలీవుడ్ నుంచి ఒక్కరుకూడా చెప్పలేదు.

అయితే ఇప్పుడు బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా భ్రహ్మస్త్ర రిలీజ్ కి సిద్ధం గా వుంది . దీని ప్రమోషన్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నే భ్రహ్మస్తంగా వాడుకుంటున్నారు భ్రహ్మస్త్ర టీం. ఈ కార్యక్రమం కోసం హైద్రాబాద్ లో భారీగా ప్రీరిలీజ్ ఈవెంట్ ని ప్లాన్చేసారు కాకపోతే గణేష్ చతుర్థి కారణం గా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వటంలో వచ్చిన ఇబ్బంది కారణం గా పర్మిషన్ ఇవ్వలేదు దీనితో ఈ కార్యక్రమాన్ని అభిమానుల మధ్యకాకుండా ఒక ప్రెస్ మీట్ లాగా కానిచ్చేశారు.

ఈ ప్రొమోషన్ కార్యక్రమంలో ఎన్టీఆర్ బాలీవుడ్ ప్రేక్షకులకు కావాల్సిన సమాధానం ఇచ్చి వారిని శాంతిపచేసాడు. ప్రేక్షకులలో సినిమాలపైన రోజురోజుకి ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోతున్నాయని, వాటిని అందుకోవాలనే ప్రెజర్ హీరోల పైన దర్శకుల పైన బాగా పడుతుందని అయినా కూడా అలాంటి ప్రెజర్ ఉంటేనే ఇంకా బాగా చేయగలుగుతాం అని ఖచ్చితంగా బ్రహ్మాస్త్ర ఆ ఎక్సపెక్టేషన్స్ ని అందుకుంటుందని తెలియజేసాడు. ఎన్టీఆర్ చెప్పిన ఈ మాటలకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయి మేము ఎం కోరుకుంటున్నామో మీరు బాగా అర్ధం చేసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

Share post:

Latest