NTR అభిమానులకు తిక్క రేగితే ఇంతే..టాప్ ట్రెండింగ్ లో తారక్ ఫ్యాన్స్ న్యూ డిమాండ్ ..!?

సినిమా ఇండస్ట్రీలో ఒక్కో హీరోకి ఒక్కో రకమైన ఫ్యాన్స్ ఉంటారు. ప్రతి హీరోని అభిమానించే అభిమానులు తమ అభిమాన హీరోని ఏమన్నా అంటే చూసి తట్టుకోలేరు. మరీ ముఖ్యంగా స్టార్ హీరో ప్లేసులో ఉన్న నందమూరి హీరో ఎన్టీఆర్ ని ఏమన్నా అంటే నందమూరి అభిమానులకు కోపం వచ్చేస్తుంది. అలాంటిది మరి అంత పెద్ద స్థాయి ..అంత మంచి మనసు ఉన్న తారక్ ని కొందరు కావాలని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ విమర్శిస్తుంటే నందమూరి అభిమానులు ఊరుకుంటారా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేయరు. ప్రజెంట్ట్ ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నారు నందమూరి అభిమానులు.

మనకు తెలిసిందే గత మూడు రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఎలాంటి వార్ జరుగుతుందో. లక్షణంగా ఉన్న ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరుని మార్చేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు . దీంతో ఏపీ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు మొదలయ్యాయి. అంతేకాదు ఎన్టీఆర్ పేరు మార్చడం పై సినీ ప్రముఖులు, ఎన్టీఆర్ అభిమానులు ,నందమూరి కుటుంబ సభ్యులు.. వైసిపి పార్టీపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోని బాలకృష్ణ ,కళ్యాణ్ రామ్ , ఎన్టీఆర్ ,మోక్షజ్ఞ ,చంద్రబాబు నాయుడు ,నారా లోకేష్ ఇలా పలువురు టిడిపి నేతలు జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడుతూ సోషల్ మీడియా వేదికగా ట్విట్స్ చేశారు.

ఇదే క్రమంలో ఎన్టీఆర్ కూడా తన తాతగారు పేరుని మార్చడం పై తనదైన స్టైల్ లో స్పందించారు. అయితే ఇది కొందరి జనాలకి నచ్చలేదు. శాంతియుతంగా దేనినైనా పరిష్కరించాలి అనుకునే ఎన్టీఆర్ ని కొందరు కావాలని ట్రోల్ చేస్తున్నారు. ఆయన పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు . మరీ ముఖ్యంగా కొన్ని మీడియా ఛానల్స్ అయితే గంటకి నాలుగు సార్లు ఎన్టీఆర్ పేరుని ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ కు తాతగారంటే గౌరవం లేదా..? కేవలం సినిమాల కోసమే నందమూరి ఫ్యామిలీని వాడుకుంటున్నారా..? నందమూరి ఫ్యామిలీతో ఎన్టీఆర్ కు ఏ సంబంధం లేదా..? కళ్యాణ్ రామ్ , బాలకృష్ణ పెట్టిన విధంగా కూడా ఎన్టీఆర్ ఎందుకు స్పందించట్లేదు . దీనికి కారణం కొడాలి నానినా..? వైసీపీతో ఎన్టీఆర్ కి సంబంధాలు ఉన్నాయా..? అంటూ చెత్తాచెదారాన్ని టెలికాస్ట్ చేస్తున్నారు.

దీంతో ఎన్టీఆర్ అభిమానులకు కోపం వచ్చేసింది. ఎన్టీఆర్ పై లేనిపోని నిందలు వేస్తూ ఆయనని కావాలని ఆయనను విమర్శిస్తున్నారు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ మీడియా ఛానల్స్ పై ఫైర్ అవుతున్నారు .అంతేకాదు బాయ్ కాట్ మీడియా ఛానల్స్ అంటూ ఆ మూడు టీవీ చానల్స్ పేర్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు . దీంతో ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి ఆ మీడియా ఛానల్స్ వైపు రావడం వాళ్లకి షాకింగ్ గా అనిపిస్తుంది . ఎన్టీఆర్ శాంతియుతంగానే ఏదైనా పరిష్కరించుకోవాలనుకుంటాడు ఆయన మాట్లాడిన దానిలో తప్పులేదు ..కానీ కొందరు ఆయనను కావాలనే టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి చూడాలి ఇ వివాదం ఎంతవరకు పోతుందో..?