ఎన్టీఆర్ తర్వాత ఆస్థానం అందుకున్న నిఖిల్..!!

ఇటీవల కాలంలో భాజపా నేతలు ఎక్కువగా టాలీవుడ్ సెలబ్రిటీల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. పాన్ ఇండియా హీరోలకు బాగా గుర్తింపు రావడంతో ప్రత్యేకంగా వారిని అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. నేరుగా నేతలే వచ్చి సెలెబ్రెటీలను సైతం హోటల్స్ లో వేదిక అరేంజ్మెంట్ చేసి కలుస్తూ ఉన్నారు. ఇక గత కొద్ది రోజుల క్రితం కేంద్రమంత్రి అమిత్ షా ఎన్టీఆర్ ను కలవడం జరిగింది. ఎన్టీఆర్ నటించిన RRR చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో ఎన్టీఆర్ నటనకు ఆయనను అభినందించారు. ఇక తర్వాత యూత్ స్టార్ నితిన్ జాతీయ అధ్యక్షుడు జేసి సద్ద ఒక స్టార్ హోటల్లో కలిశారు.

Amit Shah meets Jr NTR, sparks talk of a new political story- The New  Indian Express

దీంతో నితిన్ ని కలవడం ఏంటని పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపించాయి. అయితే వీటిపై నెటిజన్లు పలు రకాలుగా సందేహాలను కూడా వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు తాజాగా అమిత్ షా అని నేరుగా ఇవ్వ హీరో నిఖిల్ సిద్ధార్థ తో భేటీ అవ్వాలనుకున్నట్లు ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. తన మనసులో భావాన్ని యువ హీరోతో పంచుకోవాలని అమిత్ షా ఉత్సాహం చూపిస్తున్నట్లుగా సమాచారం. భారతీయ సంస్కృతిని మర్చిపోకుండా వివరించే కథని తెరకెక్కించినందుకు చిత్ర బృందం మొత్తానికి అభినందించినట్లు సమాచారం.

హైదరాబాద్ కి అమిత్ షా... నిఖిల్ కి ఆహ్వానం
ఇదివరకే ఈ సినిమాని నరేంద్ర మోడీతో సహా చూసిన కీలక సభ్యులు కూడా కార్తికేయ-2 సినిమాని ప్రశంసించడం జరిగింది. తాజాగా అమిత్ షా తో ఎంట్రీ ఇవ్వడంతో మరింత హైప్ పెరిగింది. ఏది ఏమైనా బిజెపి నేతలు ఇలా వరుసగా తెలుగు హీరోలతో భేటీ అవ్వడం రాజకీయ దుమారానికి చాలా తెరతీస్తోందని చెప్పవచ్చు తెలుగు రాష్ట్రాలలో తమ పార్టీని బలోపేతం చేయడానికి ఇలాంటి పనిచేస్తున్నారని పలువురు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ మధ్యకాలంలో తెలుగు హీరోలు మరింత పాపులర్ అవుతున్నారు.

Share post:

Latest