నాని సినీ కెరియర్.. ఈ సినిమా పైన ఆధారపడిందా..?

తెలుగు ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మంచి సక్సెస్ అయిన హీరోలలో హీరో నాని కూడా ఒకరు. ఇక తన నటనతో నాచురల్ స్టార్ నాని అనే బిరుదు కూడా పొందారు. ముఖ్యంగా ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా సినిమాలు చేసి దూసుకుపోతున్నారు. అయితే నాని నటించిన గత కొన్ని సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం హీరో నాని నటిస్తున్న చిత్రం దసరా. ఈ చిత్రం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.

Nani Dasara movie release dateFGN News | FGN News
ఈ చిత్రంపైనే నాని అభిమానులు నాని కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఈ చిత్రం వచ్చే యేడాది మార్చి 30వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది. నాని కెరియర్ లోని ఇదివరకు ఎలాంటి చిత్రాలలో నటించని విధంగా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక మాస్ లుక్ లో సందడి చేయబోతున్నారని చెప్పవచ్చు. ఈ చిత్రం మొత్తం బొగ్గు గనులు నేపథ్యంలో తెరకెక్కించడం జరుగుతుంది. ఇప్పటికి ఈ సినిమాకు సంబంధించి అప్డేట్లు విడుదలవ్వడంతో ఈ సినిమా పైన మరింత అంచనాలు పెంచేసాయి. అయితే ఈ సినిమా థియేటర్ బిజినెస్ భారీ ధరకే జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా థియేటర్ రైట్స్ ఇటీవల భారీ ధరకే అమ్ముడుపోయాయని టాక్ వినిపిస్తున్నది. నాని కెరియర్ లోని ఇప్పటివరకు జరగని బిజినెస్ ఈ సినిమాకి జరిగిందని టాక్ వినిపిస్తోంది. దాదాపుగా ఈ సినిమాకి నాన్ థియెట్రికల్ రైట్స్ 45 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు సమాచారం. నాని కెరియర్ మొత్తం ఈ సినిమా మీదే ఆధారపడిందని చెప్పవచ్చు. మరి ఈ సినిమా బిజినెస్ పరంగా బాగానే జరుపుకున్నప్పటికీ కలెక్షన్ లు ఎలా రాబడుతుందో నాని కెరియర్ ని ఎలా డిసైడ్ చేస్తుందో చూడాలి మరి.