నాగార్జున ఫేవరెట్ మూవీ.. అందుకే ఫ్లాప్ అయ్యిందా?

టాలీవుడ్ కింగ్ నాగార్జున గురించి పత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నాగేశ్వరరావు నట వారసుడిగా మూవీస్ లో ఎంట్రీ ఇచ్చన ఆయన తన సొంత టాలెంట్ లో టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. తెలుగులోనే కాదు, హిందీ సినిమాల్లోనూ రాణించారు. ఇక కొత్త టాలెంట్ ని వెలికి తీసి మరి అవకాశాలు ఇస్తారు..నాగార్జున తన సినీ కెరీర్ లో ఎన్నో మరిచిపోలేని సినిమాలు చేశారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు.

నాగార్జున టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లోనూ సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. నాగ్ స్టయిల్ కి బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే కొంత మంది దర్శక నిర్మాతలు బాలీవుడ్ లో సినిమాలు వద్దని నాగార్జునకు సలహాలు ఇవ్వడంతో.. ఆయన బాలీవుడ్ వైపు వెళ్లలేదు.. ఒకవేళ ఆయన బాలీవుడ్ లో సినిమాలు కొనసాగించి ఉంటే.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎదిగేవారు..

ఆ సమయంలో ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, మహేష్ భట్ మల్లీ లింగువల్ సినిమాలు చేశారు. అయితే ఆ సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. అలాంటి సినిమాలలో ఒకటి క్రిమినల్.. బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అప్పట్లో క్రిమినల్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా అంటే నాగార్జునకు ఎంతో ఇష్టమట.. ఈ సినిమాలో నాగార్జునతో పాటు హీరోయిన్లు రమ్యక్రిష్ణ, మనీషా కోయిరాలా చేశారు. ఇక నాగార్జున డాక్టర్ అజయ్ పాత్రలో నటించి మెప్పించారు.

ఈ సినిమా సొంత కథ కాదు.. ఫ్యుజిటివ్ అనే ఇంగ్లీస్ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కించారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని భావించారు. అంతేకాదు ఈ సినిమాలో నటించిన్పుడు నాగార్జున వేరే సినిమాలకు కమిట్ కాలేదు.. ఎంతో ఇష్టపడి ఈ సినిమాను చేశారు. అయితే ఈ సినిమా రిజల్ట్ మాత్రం భిన్నంగా వచ్చింది. ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ఈ సినిమా రిజల్ట్ పై నాగార్జున చాలా ఫీల్ అయ్యారని సమాచారం.. ఈ సినిమాలోని పాటలు మాత్రం ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి..

Share post:

Latest