మెగా ఇంటికి క్యూ కట్టిన క్రికెటర్స్.. ఎందుకో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటిలో సడన్ గా స్టార్ క్రికెటర్స్ ప్రత్యక్షమయ్యారు. ఫేమస్ క్రికెటర్స్ చరణ్ ఇంటికి రావడం నేషనల్ వైడ్ సెన్షేష‌న‌ల్ న్యూస్‌గా వైరల్ అయింది. రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ మూవీ తో తన ఇమేజ్ విశ్వవ్యాప్తమైంది. రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించ‌డంతో పాటు త్రిబుల్ ఆర్‌లో మ‌నోడి న‌ట‌న‌ను తన ప్రతిభను హాలీవుడ్ ప్రముఖులు సైతం కొనియాడారట.

అమెరికాలో త్రిబుల్ ఆర్ మూవీ వసూళ్ల వర్షం కురిపించింది. ఇక నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా 14 వారాలు టాప్ టెన్ లో కొనసాగి మంచి విజ‌యం సాధించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన గురించి అంతర్జాతీయ మీడియాలో సైతం వార్తలు వైరల్ గా మారాయి. ఆస్కార్ బరిలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు వినిపించాయి. తాజాగా ఇండియన్ క్రికెటర్లు రామ్ చరణ్ ఇంటికి వచ్చారు.

సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య రామ్ చరణ్ ని కలవడానికి వారి ఇంటికి వచ్చారు. రామ్ చరణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవిని కూడా ఈ సూపర్ స్టార్ క్రికెటర్స్ కలిసి మాట్లాడారట. ఇక ఈ స్టార్ క్రికెటర్స్ మెగాస్టార్ ఫ్యామిలీని కలవడం.. వారి నివాసానికి వెళ్లడం టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఇక వీరి మీట్‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్న ఆస్ట్రేలియా – ఇండియా మధ్య 20-20 మ్యాచ్ హైదరాబాద్ లో జరిగింది.

ఈ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి బంతి వరకు మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఇకపోతే భారత్ 186 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం స్టార్ క్రికెటర్స్ హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ రాంచరణ్ ఇంటికి వచ్చారు. అయితే వారికి రామ్ చరణ్ ఆహ్వానం పలుకుతూ మంచి విందు భోజనం ఏర్పాటు చేశారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share post:

Latest