ఆస్కార్ బరిలో మరొకసారి మెగా హీరో పేరు..!!

బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా ప్రఖ్యాత మరింత పెరిగిపోయింది.RRR సినిమా కు కూడ ఫ్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా కూడా వార్తల్లో నిలిచింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటన కనబరిచారు. ఇక ఈ సినిమాని రాజమౌళి ఎంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తేరకెక్కించారు. ఈ చిత్రం స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఇద్దరు స్వతంత్ర యోధుల కథ ఆధారంగా చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో మేకింగ్ కి ఏమాత్రం తీసుకొని స్థాయిలో ప్రదర్శించడం జరిగింది.

RRR Movie Review: Jr NTR-Ram Charan's Film Is High On Bromance, Grand  Visuals And Superlative Performances - Filmibeat
ఈ చిత్రం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా సినీ ప్రముఖులను సైతం మెప్పించింది. ఇక హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ సినిమాను చూసి.. ఈ చిత్రంలో నటించిన నటీనటులు ఎవరా ఆని నెట్లో తెగ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రిమింగ్ మొదలైన తరువాతే ఎక్కువ హంగామా మొదలైందని చెప్పవచ్చు.దీంతో ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకి లేని స్థాయిలో గ్లోబల్ మూవీగా RRR సినిమా పేరు సంపాదించింది. ఇక ఈ సినిమాకి దీంతో ఆస్కార్ అవార్డు కాయమంటూ బాగా ప్రచారం జరిగింది. మన వాళ్లతో పాటు హాలీవుడ్ స్టార్ స్ ఆడియన్స్ సైతం ఈ సినిమాకి కచ్చితంగా ఆస్కార్ బరిలో నిలుస్తుందని ప్రచారాన్ని మొదలుపెట్టారు.

They're gay:' Ram Charan, Jr NTR's RRR perceived as queer story by western  audience; Indian fans are confused | Celebrities News – India TV
RRR సినిమాలో నటించిన ఎన్టీఆర్ కొమరం భీమ్ కు ఆస్కార్ బరిలో నిలవడం ఖాయమని అందరూ అనుకున్నారు అయితే చాలామంది ఎన్టీఆర్ కు ఆస్కార్ ఇవ్వాలని అంటూ ప్రిడిక్షన్ చేయడం మొదలుపెట్టారు. దీంతో హాలీవుడ్ స్టార్స్ కూడా ఎన్టీఆర్ నటనకు ప్రశంసలు వర్షం కురిపించారు. అయితే ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఉత్తమ నటుడు క్యాటగిరిలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు బాగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ విషయం నిజం కావాలని బలంగా కోరుకుంటున్నారు అభిమానులు.

Share post:

Latest