మరో యదార్థ సంఘటనతో వస్తున్న మెగా హీరో..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబం నుంచి హీరో వరుణ్ తేజ్ ఎంట్రీ ఇచ్చి ఎన్నో సంవత్సరాలవుతోంది.. ఏన్నో మంచి విజయాలను కూడా అందుకొని దూసుకుపోతున్నారు. అయితే వరుణ్ తేజ్ చివరిగా నటించిన f-3 మంచి విజయాన్ని అందుకుంది. ఆ తదుపరి సినిమా ని ప్రకటించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోని ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ విడుదల చేశారు. వరుణ్ తేజ్ ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా సమాచారం.

Telugu Actor #VarunTej, Who Has Carved a Name for Himself in the Telugu  Industry, Has Now ... - Latest Tweet by IANS India | 📰 LatestLY

అంతేకాకుండా ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. బ్రాండెడ్ స్క్రిప్ట్ ని చదివి ఈ సినిమా కథ నచ్చడంతో వరుణ్ తేజ్ ఈ సినిమాకి ఒకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ట్విట్టర్ ద్వారా ఒక వీడియోను కూడా షేర్ చేశారు వరుణ్ తేజ్. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించబోతున్నట్లు సమాచారం. ఇక గని సినిమాతో అభిమానుల నిరాశపరిచిన వరుణ్ తేజ్ మరి ఈ సినిమాతో ఎలా ఆనందపరుస్తారో చూడాలని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాని అనిల్ రావుపూడి తండ్రి ప్రవీణ్ సత్తూరు దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఈ విషయం గురించి ఎలాంటి క్లారిటీ ఇంకా రాలేదు. అయితే తన తదుపరి సినిమా గురించి మాత్రం త్వరలోనే అన్ని విషయాలు అధికారికంగా వెల్లడించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాని నాగబాబు అంజన ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించబోతున్నారుగా కూడా వార్త వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ సక్సెస్ అవుతాడా అనే విషయం తెలియాలి అంటే మరొక కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది.

Share post:

Latest