లాస్ట్ కి ఇలా కూడా నా..వాళ్ల పై ఆధారపడుతున్న సీనియర్ స్టార్ హీరోలు..!!

మెగాస్టార్‌ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్గా రీయంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా చిరంజీవి స్టామినాను మళ్ళీ టాలీవుడ్‌కు చూపించింది. ఆ సినిమా తర్వాత చిరంజీవి నటించిన సినిమాలు అంత ఇంపార్ట్‌ చూపించలేకపోయాయి. ఆ సినిమా తర్వాత నటించిన సినిమాల్లో ఆయన ఒక సైరా నరసింహారెడ్డి సినిమా తప్ప మిగిలిన ఏ సినిమా హిట్ అవ్వలేకపోయింది. తాజాగా వచ్చిన ఆచార్య సినిమాతో చిరంజీవి ఇమేజ్ మరింత డామేజ్ అయింది. ఈ సినిమా చిరంజీవి సినిమాలోని అత్యంత చెత్త సినిమాగా మిగిలిపోయింది.

చిరంజీవి ఆచార్య సినిమా తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. వాటిలో గాడ్ ఫాదర్ సినిమా వచ్చేనెల ఐదో తారీఖున ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో చిరంజీవి ఆచార్య సినిమా ఇచ్చిన ప్లాప్ ను తిప్పి కొడతారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇదే క్రమంలో చిరంజీవి పై ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవి సినిమాలు ఆయన రీయంట్రీ ముందు చేసినట్టు ఇప్పుడు చేసే సినిమాలు అలా ఉండటం లేదని టాక్ వినిపిస్తుంది. ఆయన ఎక్కువ రీమేక్ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడని. గాడ్ ఫాదర్ కూడా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్ గా వస్తుంది. ఆ తర్వాత సినిమా బోలా శంకర్ కూడా తమిళ్ సినిమా వేదాళంకి రేమేక్‌గా వస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇలా చిరంజీవి వరుస పెట్టి రీమిక్స్ సినిమాలు చేయడంతో ఆయన గ్రేస్ తగ్గిపోతుందని అభిమానులు బాధపడుతున్నారు.

Venkatesh and Chiranjeevi postpone the shoot

ఈ మూడు సినిమాలు కాకుండా బాబీ డైరెక్షన్లో వాల్తేరు వీరయ్య‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటించబోతున్నాడు. ఈ సినిమా గురించి ఒక వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో రవితేజ తో పాటు విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఆ సినిమాకి సరిగా కథ లేకపోవడంతో డైరెక్టర్ మరియు చిరంజీవి కలిసి ఆ సినిమాకి ఎలాగైనా హైప్‌ తీసుకురావాలని ఇతర హీరోలని ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేపిస్తున్నారని తెలుస్తుంది.

Share post:

Latest