వెంకటేష్ ఫ్లాప్ మూవీ టైటిల్ తో పవన్ కళ్యాన్ సినిమా

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సినిమా వస్తుందంటే చాలు.. ఆ మూవీపై భారీ అంచనాలు ఉంటాయి.. ఇక ఫ్యాన్స్ లో మాత్రం పూనకాలు మొదలైపోతాయి.. అది మామూలు సినిమా అయినా పెద్ద హైప్ వచ్చేస్తుంది. ఆ సినిమా ఎలా ఉన్నా నెగటివ్ టాక్ చెబితే మాత్రం ఆయన అభిమానులు అంగీకరించరు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ని ఒక్క మాట అన్నా కూడా ఊరుకోరు. అలా పవన్ కెరీర్ లో ట్రైలర్ దగ్గర నుంచి పాటల వరకు విపరీతమైన హైప్ క్రియేట్ అయిన సినిమాల్లో ‘పంజా’ ఒకటి..

పంజా సినిమాను తమిళ టాప్ దర్శకుడు విష్ణు వర్ధన్ తెరకెక్కించగా.. ఆర్కా మీడియా సంస్థ ఈ మూవీని నిర్మించింది.. పవన్ కెరీర్ లో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎంటర్టయినర్ గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్, టైటిల్ సాంగ్ వచ్చినప్పుడు అభిమానులకు పూనకాలే.. ఈ మూవీ పవన్ కెరీర్ లో ఓ బిగ్గెస్ట్ హిట్ అవుతుందని భావించారు.. తీరా సినిమా రిలీజ్ అయ్యాక అందరినీ నిరాశ పరిచింది. పవన్ కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన ఎంతో బాగున్నప్పటికీ.. కథ, కథనం బలహీనంగా ఉండటంతో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినట్లు టాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అయితే ఈ మూవీ గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.. ఈ సినిమాకు మొదట ‘ది షాడో’ అనే టైటిల్ ని పెట్టాలని దర్శక నిర్మాతలు అనుకున్నారట.. కానీ ఈ టైటిల్ పవన్ కళ్యాణ్ కి నచ్చలేదట.. అందుకే పవన్ సూచన మేరకు టైటిల్ ని ‘పంజా’ అని మార్చారట.. ఆ తర్వాత హీరో వెంకటేష్ ‘షాడో’ అనే టైటిల్ తో సినిమా తీశారు.. అయితే షాడో సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ఇలా షాడో టైటిల్ అనుకున్న రెండు సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయని చర్చించుకుంటున్నారు. అప్పట్లో పంజా సినిమా 18 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.. ఇక ఓపెనింగ్స్ పరంగా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ టాప్-2గా, ఓవర్సీస్ లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది..

Share post:

Latest