తన రెమ్యూనరేషన్ కట్ చేసిన పర్వాలేదు.. హీరోయిన్ గా ఆమెనే కావాలంటున్న బాలయ్య..

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నారు.. సినిమా మీద సినిమా ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో 107వ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ కావస్తోంది.. ఈ సినిమా పూర్తి కాకముందే బాలయ్య తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యాడు. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేయబోతున్నాడు.

అయితే ఈ మూవీలో నటించబోయే హీరోయిన్ పై చాలా రోజులుగా ఉత్కంఠ నెలకొంది. సీనియర్ హీరో అయిన బాలయ్యతో నటించడానికి యంగ్ హీరోయిన్లు ఇంట్రెస్ట్ చూపించడం లేదని టాక్.. ఆసక్తిగా ఉన్న హీరోయిన్స్ కి పెద్దగా గుర్తింపు లేదు. అందుకే స్టార్ హీరోయిన్ ని బాలయ్య సినిమాలో తీసుకోవాలని దర్శకుడు అనిల్ రావిపూడి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బాలయ్య సరసన నయనతారను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

గతంలో బాలయ్య సరసన నయనతార బ్లాక్ బస్టర్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకుంది.. సింహా, శ్రీరామ రాజ్యం సినిమాల్లో వీరి జోడి అద్భుతంగా వర్కవుట్ అయ్యింది. అందుకే నయనతార అయితే సినిమాకు బాగుంటుందని దర్శకుడు అనిల్ రావుపూడి ఆమె సంప్రదించాడట.. అయితే నయనతార మాత్రం 4 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. అందుకే ఆమెను కాదని మరో హీరోయిన్ ని తీసుకోవాలని అనిల్ రావుపూడి ప్రయత్నిస్తున్నాడని వార్తలు వచ్చాయి..

కానీ బాలయ్య మాత్రం నయనతార హీరోయిన్ గా అయితేనే బాగుటుందని, ఈ మూవీలో పాత్రకు ఆమె కచ్చితంగా న్యాయం చేస్తుందని చెబుతున్నారట. ఆమె ఎంత డిమాండ్ చేసినా ఇవ్వాలని చెప్పారట. బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదని, కానీ తన సినిమాలో ఆమె హీరోయిన్ గా కావాలని డైరెక్టర్ కి సూచించారట.. అంతేకాదు.. తన రెమ్యూనరేషన్ లో కొంత కట్ చేసినా పర్వాలేదని చెప్పినట్లు సమాచారం.. నయన్ కోసం బాలయ్య ఇంతగా పట్టుపడుతున్నారంటే ఆమెకు ఉన్న ప్రాముఖ్యత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

Share post:

Latest