ఆ ఒక్క విషయంలో సక్సెస్ కాలేకపోయిన యాంకర్ సుమ..

యాంకర్ సుమ అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. యాంకర్లలో సుమకు అంతటి పాపులారిటీ ఉంది. ఎంత పెద్ద ఈవెంట్ అయినా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో ఆకట్టుకుంటుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా యాంకరింగ్ లో తనమైన ముద్ర వేసుకున్నారు. కనీసం సుమ దరిదాపుల్లో కూడా ఎవరూ కనిపించడం లేదు. పెద్ద హీరోలకు సంబంధించిన ఏదైనా ఈవెంట్ లలో తన మాటలతో మాయ చేయడం సుమ స్పెషాలిటీ. అందుకే సుమను బుల్లితెర మెగాస్టార్ అంటారు. సుమ చేసే షోలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. అందుకే ఆమె అడుగుపెడితే చాలు అక్కడ సక్సెస్ అయ్యారు. అయితే ఒక్క విషయంలో మాత్రం యాంకర్ సుమ సక్సెస్ కాలేకపోయారు.. తన సొంత ప్రొడక్షన్ హౌస్ లో చేసిన షోలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమె భారీగా నష్టపోవాల్సి వచ్చింది.

పదేళ్ల క్రితం యాంకర్ సుమ తన సొంత ప్రొడక్షన్ లో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అప్పట్లో తన ప్రొడక్షన్ హౌస్ ప్రారంభానికి జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. ఎందుకంటే ఆమె భర్త రాజీవ్ కనకాల మరియు ఎన్టీఆర్ మంచి స్నేహితులు అని అందరికీ తెలిసిందే.. అందుకే ఎన్టీఆర్ తో తన ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించింది. సొంత నిర్మాణంలో రెండు, మూడు ప్రోగ్రామ్స్ ని తీసుకొచ్చింది సుమ.. అయితే ఆ కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

సుమ తీసుకొచ్చిన కార్యక్రమాల్లో కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. లక్ అయితే కలిసి రాలేదు. ఆమె నిర్మాణంలో వచ్చిన ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ కాలేకపోయాయి. ఒక్క కార్యక్రమం కూడా ఏడాదికి మించి సాగలేదు. అయితే సుమ ఇతర నిర్మాణ సంస్థల్లో చేసిన కార్యక్రమాలు అన్ని సూపర్ సక్సెస్ సాధించాయి. కానీ తన సొంత నిర్మాణంలో చేసిన ఒక్క ప్రోగ్రామ్ కూడా హిట్ కాలేదు.. భవిష్యత్తులో సుమ తన సొంత నిర్మాణంలో ఏదైనా సినిమా లేదా కార్యక్రమం చేస్తే.. అక్కడైనా సక్సెస్ అందుతుందో లేదో చూడాలి.

Share post:

Latest