యాంకర్ సుమని ఆంటీ అన్న కుర్రాడు… అగ్గిమీద గుగ్గిలమైన సుమ!

యాంకర్ సుమ అంటే ఎవరో తెలియని తెలుగు కుటుంబం ఉండదనే చెప్పుకోవాలి. ఆమె బుల్లితెరపై చేసే హంగామా అంతాఇంతా కాదు. ఆమె పంచ్‌లు వేస్తే అవతలి వాళ్లు కౌంటర్లు వేయడానికి కూడా ఇంకేం మిగలదు. బుల్లితెర యాంకర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన ఈ మలయాళీ భామ దశాబ్దానికిపైగానే ఇక్కడ దూసుకుపోతోంది. ఈమధ్యకాలంలో ఎక్కువగా సినిమా ఈవెంట్ల మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే ఈమె లేనిదే సినిమా ఈవెంట్లు కూడా జరిగే అవకాశం లేనట్టు తయారవుతోంది. గతంలో జీ తెలుగు, స్టార్ మా, ఈటీవీ ఇలా అన్నింట్లోనూ కనిపించే సుమ ఇప్పుడు మాత్రం ఒక్క ఈటీవీలోనే కనిపిస్తోంది. అది కూడా క్యాష్ షోను మాత్రమే చేస్తోంది.

ఇపుడు సుమ చేతిలో ఉన్న ఏకైక ఎంటర్మైన్మెంట్ ప్రోగ్రాం అది. ప్రతీ శనివారం సుమ తన అభిమానులను క్యాష్ షో ద్వారా పలకరిస్తోంది. ఒకప్పుడు గెస్టులను పిలవడంలోనూ వైవిధ్యత ఉండేది. కానీ ఇప్పుడు సినిమా ప్రమోషన్లకే ఎక్కుగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుంది. గత వారం బ్రహ్మాస్త్రం టీం గెస్టుగా వచ్చింది. మొదటి సారిగా రాజమౌళి ఇలా ఓ షోకు వచ్చాడు. దాంతో ఒక్కసారిగా క్యాష్ షో నేషనల్ టాపిక్ అయింది. ఇక ఇప్పుడు క్యాష్ షోలో జబర్దస్త్ గ్యాంగ్ వచ్చింది. గడ్డం నవీన్, బాబు, బుల్లెట్ భాస్కర్, నరేష్ ఇలా కమెడియన్ల గ్యాంగ్ అంతా కూడా వచ్చారు.

అయితే ఇందులో నరేష్ మీద సుమ వరుసగా పంచులు వేసింది. మామూలుగానే నరేష్ అంటే సుమ దారుణంగా కౌంటర్లు వేస్తుంటుంది. దాంతో ఓ సందర్భంలో నరేష్ ఆంటీ… ఏంటి చెప్పండి? అంటాడు. వెంటనే సుమ వాడిపైన గుర్రుగా చూస్తుంది. దాంతో ఆ షోలో వున్నవారు పకపకా నవ్వుతారు. మీ అందరికీ రూల్స్ తెలుసు కదా? అని సుమ అంటే.. కొత్తగా ఏమైనా ఉంటే చెప్పండి అని నరేష్ అంటాడు. నువ్వే ఇంత పాత బడుతున్నావ్ ఇంకా కొత్తగా ఏం చెప్పాలి అని అంటుంది సుమ. ఇక తాజాగా విడుదల అయిన ప్రోమో నవ్వులు పూయిస్తోంది… కావాలంటే చూడండి!

Share post:

Latest