ఆ దివంగత నటుడు చేసిన మల్టీస్టారర్ సినిమాలు… ఎవరూ చేయలేదట..!

తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీ స్టార్ సినిమాల ట్రెండ్ ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తుంది. ఇలా మల్టీ స్టార్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన నటులలో సీనియర్ హీరోలు ఉన్నారు. ఈతరం హీరోలు ఉన్నారు.
సీనియర్ హీరోలలో ఒక నటుడు తన చేసిన సినిమాలలో ఎక్కువ శాతం మల్టీస్టారర్ సినిమాలే చేశారు అతను ఎవరో ఇప్పుడు చూద్దాం. దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆయన నిన్న తెల్లవారుజామున మరణించారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రభుత్వ లాంఛనాలతో హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ లో జరిగాయి. ఈ క్రమంలోనే కృష్ణంరాజు తన సినిమా కెరియర్ లో ఎక్కువ సినిమాల్లో ఇతర హీరోలతో కలిసి నటించారు. ఆయన ఆతరం హీరోలతో ఈ తరం హీరోలతో కూడా కృష్ణంరాజు నటించి మెప్పించాడు.

Mahesh Koneru on Twitter: "What a lovely photo ..Legends of Telugu Film  Industry.. NTR, ANR, Superstar Krishna and Rebel Star Krishnam Raju  http://t.co/Aux5NNft2E" / Twitter

కృష్ణంరాజు తన కెరియర్ మొదట్లో ఎన్టీఆర్ తో కలిసి బడిపంతులు సినిమాలో ఒక క్యారెక్టర్ లో నటించాడు, అత‌ర్వాత‌ ఆయనతో సతీ సావిత్రి, మంచికి మరో పేరు, మనుషులలో దేవుడు, వాడే వీడు వంటి సినిమాలలో కూడా ఎన్టీఆర్ తో కలిసి కృష్ణంరాజు నటించి మెప్పించాడు.ఆ తర్వాత కృష్ణంరాజు ఎక్కువ కలిసి సినిమాలు చేసి నటించిన హీరో అక్కినేని నాగేశ్వరరావు. వీరిద్దరూ కలిసి జై జవాన్, ఎస్పీ భయంకర్, పవిత్ర బంధం, బుద్ధిమంతుడు వంటి సినిమాల్లో కలిసి నటించాడు.

Photo Moment: Chiru, Nag and Venky with Rebel Star | 123telugu.com

ఆ తర్వాత కృష్ణంరాజు సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, వీరి తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వెంకటేష్ వంటి హీరోలతో కలిసి నటించాడు కృష్ణంరాజు. అంతేకాదు నట సింహం నందమూరి బాలకృష్ణతో కలిసి రెండు సినిమాలలో నటించాడు అవి ఎంతటి సూపర్ హిట్ అయ్యాయో మనందరికీ తెలుసు. ఆ తర్వాత నేటితరం హీరోలతో కూడా కలిసి నటించాడు కృష్ణంరాజు. వాళ్లలో ప్రభాస్ ఒక్కడైతే ఉదయ్ కిరణ్, నాని, నితిన్ వంటి కుర్ర హీరోల సినిమాలలో కూడా కృష్ణంరాజు కలిసి నటించి మెప్పించాడు.

Share post:

Latest