ఎన్టీఆర్ లా నటించడం నావల్ల కాదు అంటున్న కోలీవుడ్ హీరో..!!

సాధారణంగా ఎన్టీఆర్ సినిమా వస్తోందంటేనే పూనకాలు వచ్చినట్టు ప్రేక్షకులు ఊగిపోతారు. ఇక థియేటర్లో ఆయన చెప్పే డైలాగుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ సీన్ లోకి ఎంటర్ అయిన దగ్గర్నుంచి ఎండ్ అయ్యే వరకు ఆడియన్స్ థియేటర్లో విజిల్స్ తో దద్దరిల్లేలా చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే ఆయన లాగా డైలాగులు చెప్పడం తన వల్ల కాదు అంటూ ఒక కోలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.Karthi: Ponniyin Selvan is an achievement in itself | Entertainment  News,The Indian Express

ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో శుక్రవారం జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా ఐశ్వర్యరాయ్, త్రిష, విక్రం , కార్తీ, జయం రవి, ఏఆర్ రెహమాన్ , తనికెళ్ల భరణి, దిల్ రాజు, శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇకపోతే ఈ వేడుకలో హీరో కార్తీ మాట్లాడుతూ.. ఎన్నో విషయాలను తెలియజేశారు. పొన్నియన్ సెల్వన్ లాంటి గొప్ప సినిమా చేసినప్పుడు చాలా విషయాలు గుర్తుకొస్తున్నాయి. కులం , మతం అనే విషయాలను పక్కన పెట్టినప్పుడు సినిమా ఎంత గొప్పదో అర్థమవుతోంది. మనందరిని కలిపే సాధనమే సినిమా.. ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను.. ఈ వేడుకకు వచ్చిన మీడియా, అభిమానులకు ధన్యవాదాలు అంటూ తెలియజేశారు.

Haven't read 'Ponniyin Selvan'? Here's your cheat sheetఇక అంతే కాదు పొన్నియన్ సెల్వన్ సినిమాలో డైలాగ్స్ చెప్పేటప్పుడు ఎన్టీఆర్ ను గుర్తుకు చేసుకొని మరి డైలాగులు చెప్పాను. ఇక అలా డైలాగులు చెప్పడం అంత ఈజీ కాదు .. ఎన్నో చారిత్రక సినిమాలు ఆయన చేశారు.. ఆయన డైలాగ్ డెలివరీ విషయంలో ఎవరు పోటీ పడలేము ..అందుకే మేము జాగ్రత్తగా డైలాగ్స్ చెప్పే ప్రయత్నం చేసాము అంటూ కార్తి తెలిపారు. ఇక ఎన్టీఆర్ లాగా డైలాగులు చెప్పేవారు ఇంకా పుట్టలేదేమో అంటూ కూడా ఆయన పరోక్షంగా కామెంట్లు చేయడం గమనార్హం . ఏది ఏమైనా ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఎన్టీఆర్ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest