బ్రేకింగ్: రాజకీయాల్లోకి హీరోయిన్ కంగనా.. అందుకేనా ఈ తతంగం?

బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఈమెకి వున్న ఫాలోయింగ్ గురించి కూడా అందరికీ తెలిసినదే. ఈమె ఏం చేసినా, ఏం మాట్లాడినా టాక్ అఫ్ ది టౌన్ అవుతుంది. కంగన నోటికి స్పీడెక్కువే కానీ ఎవరినైనా ఎదురించగలిగే ఆ గట్స్ ని ప్రశంసించని వాళ్లు లేరు. నోటి దురుసు తనను చిక్కుల్లో వేస్తున్నా కానీ తిరిగి ఇంతలోనే చాకచక్యంగా ఆ సమస్యను పరిష్కరించుకుంటూ తెలివైన భామ అని నిరూపిస్తోంది. దిగ్గజ రాజకీయ నాయకులతో వైరం కొనసాగిస్తున్న కంగన అటు బాలీవుడ్ మాఫియా పెద్దల్ని అంతే ధీటుగా ఎదురించి నిలుస్తోంది.

ప్రత్యర్థికి కంటి మీద కునుకుపట్టనివ్వని దుందుడుకు కంగనకు ఆభరణం. ఇలా క్వీన్ గురించి చెప్పుకుంటూ వెళితే ఒక రాజకీయ నాయకురాలు కావడానికి అవసరమయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని అంగీకరించాలి. ఇప్పటికే ప్రధాని మోదీకి.. భాజపాకు కంగన ఫాలోవర్ అన్న ముద్ర ఉండనే ఉంది. కాబట్టి మునుముందు రాజకీయాల్లోకి వస్తుందా? భాజపాలో చేరే ఆలోచన చేస్తోందా? అంటూ ఇప్పటికే బోలడంత చర్చ సాగుతోంది. ఇక కంగన అన్ని రంగాల పెద్దలు ప్రముఖులతో సత్సంబంధాలను కొనసాగించడంలోనూ ఎప్పుడూ చాకచక్యం ప్రదర్శిస్తుంది.

తన ప్రతిభకు తగిన గుర్తింపు దక్కకపోతే ఏ కళాకారిణి అయినా ఆవేదన చెందడం సహజం. కానీ కంగన పని తీరుకు గుర్తింపు దక్కింది. అద్భుత నటనతో ఆకట్టుకున్నందుకు అత్యుత్తమ అవార్డుకు నామినేట్ చేశారు. కానీ తననుంచి అనూహ్యమైన స్పందన ఎదురైంది. ఫిలింఫేర్ ఉత్సవాలపై కంగన ప్రతిసారీ అనాసక్తతను కనబరుస్తోన్న సంగతి విదితమే. ఈమె ముక్కుసూటి వైఖరికి దుందుడుకు స్వభావానికి నోటి దురుసుకు పరిశ్రమలో అంతా శత్రువులుగా మారగా ఒక సెక్షన్ అభిమానులు మాత్రం కంగన ధైర్యానికి ప్రశంసలు కురిపించడం కొసమెరుపు.

Share post:

Latest