కాజల్ అగర్వాల్ బికినీ షో.. వైరల్ అవుతున్న ఫొటోలు..

కాజల్ అగర్వాల్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. తేజ నిర్మించిన లక్ష్మీ కల్యాణం చిత్రం ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కాజల్.. చందమామ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో టాప్ హీరోయిన్ గా నటిస్తోంది.. ఇదిలా ఉంటే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బికినీలో ఉన్న కొన్ని ఫొటోలు నెట్టింట రచ్చ రేపుతున్నాయి. ఆ ఫొటోల్లో కాజల్ కేక పెట్టిస్తున్నారు. బిడ్డకు తల్లి అయినా తన గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పెళ్లి, ఆ వెంటనే ప్రెగ్నన్సీ కారణంగా కాజల్ సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆమెకు పండంటి పిల్లాడు కూడా పుట్టేశాడు. టాలీవుడ్ చందమామ తన కొడుకు నీల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట్ వైరల్ అవుతోంది. బాహుబలి చిత్రంలో సీన్ లాగా తన కొడుకు నీల్ కాలిని తలపై పెట్టుకుంది. ఆ ఫొటోను రాజమౌళికి అంకితం ఇస్తున్నట్లు పోస్ట్ పెట్టింది.

ఇదిలా ఉంటే.. పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ అసలు సినిమాల్లో నటిస్తుందా లేదా అనే సందేహం ఉండేది.. కానీ ఇటీవల కాజల్ ఆ సందేహాలపై క్లారిటీ ఇచ్చింది. సినిమాల్లో తన రీఎంట్రీపై స్పష్టత ఇచ్చింది.. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమాల్లో నటిస్తున్నట్లు చెప్పింది. ఈ ఇండియన్ 2 సినిమా 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

కాగా, కాజల్ అగర్వాల్ చివరిగా చిరంజీవి హీరోగా వచ్చిన ఆచార్య సినిమాలో నటించారు. అయితే ఆమె నటించిన పార్ట్ ను దర్శక నిర్మాతలు తొలగించారు. ఆమె క్యారెక్టర్ సినిమాకు అంతగా ఉపయోగం ఉండదని భావించి అలా చేశారు. కాజల్ సినిమాలో లేనందున ఆచార్య టీమ్ కి దాదాపు 7 కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లు టాక్.