ఎన్టీఆర్ పేరు మార్చడం పై జూనియర్ ఎన్టీఆర్ సంచలనం ట్వీట్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఈ కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలలో నటించి విజయవంతంగా నిలిచారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కూడా పేరుపొందాడు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు చేయడం జరిగింది. ఎన్టీఆర్ పేరుకు బదులు వైయస్సార్ పేరు పెట్టడంపై టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగడం జరిగింది. అటు వైసీపీ మాత్రం ఎన్టీఆర్ పేరైతే..ఆ అర్హత టిడిపికి లేదని ఎదురుదాడికి దిగడం జరిగింది. దీంతో పోటాపోటీ డైలాగులతో రాజకీయం చాలా వేడెక్కింది అని చెప్పవచ్చు. దీంతో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ అంశంపై స్పందించడం జరిగింది వాటి గురించి చూద్దాం.

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందన ఇదే

ఎన్టీఆర్ తన ట్విట్టర్ లో ఇలా రాసుకొస్తూ.. ఎన్టీఆర్, వైయస్సార్ ఇద్దరూ కూడా విశేష ప్రజాదరణ పొందిన గొప్ప నాయకులని తెలియజేశారు. ఒకరు పేరు తీసి ఇంకొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైయస్సార్ స్థాయిని పెంచదు అలాగే ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని తెలియజేశారు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తి .. తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయి తెలుగు ప్రజల హృదయాలలో చెరపలేని జ్ఞాపకాలు అని ఎన్టీఆర్ తెలియజేశారు.

అయితే ఎన్టీఆర్ తాత గారికి అవమానం జరిగింది అంటూ ఎన్టీఆర్ సీరియస్ అవుతారని అందరూ భావించారు. కానీ ఈ విధంగా ట్వీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు ఎన్టీఆర్. ఎన్టీఆర్.. వైయస్సార్, ఎన్టీఆర్ ని కలిపి ఒకే విధంగా చూడడం ద్వారా ఎన్టీఆర్ చాలా ఇంటలిజెంట్ గా వ్యవహరిస్తున్నాడంటూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారుతుంది. గతంలో కూడా ఎన్నో సందర్భాలలో ఎన్టీఆర్ ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా తనదైన స్టైల్ లో స్పందించారు.

Share post:

Latest