Jr NTR బుచ్చిబాబుకి ఛాన్స్ ఇస్తాడా? ఎంతకాలం పాపం వెయిట్ చేస్తాడు?

యంగ్ టైగర్ Jr NTR ఫ్యాన్స్ ను కాస్త నిరాశపరుస్తున్నాడు. RRR తరువాత తారక్ ఎందుకనో మౌనం వహించాడు. సోషల్ మీడియాలో తారక్ యాక్టివ్ గానే ఉన్నారు అయినా తన తర్వాత సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోవడం నందమూరి అభిమానులను కలచివేస్తోంది. మరో 6 నెలల్లో తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ మొదలు కానుందని అంటున్నారు. మరి ఈ గ్యాప్ లో కొరటాల శివ కాంబో మూవీ షూట్ పూర్తవుతుందా? అసలు వీరి సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు కూడా.

ఓవైపు RRR తరువాత రామ్ చరణ్ జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు. శంకర్ దర్శకత్వంలో చరణ్ చేస్తున్న సినిమా ఆఘమేఘాలమీద కంప్లీట్ చేస్తున్నారు. తారక్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అభిమానులకు మింగుడు పడటం లేదు. ఆ సంగతి కాస్త పక్కన బెడితే ఉప్పెన సినిమా దర్శకుడుని కూడా తారక్ లైన్లో పెట్టి నిమ్మకున్నాడు. ఈ విషయమే అభిమానులకు కాస్త నిరుత్సాహ పరుస్తోంది. తారక్ మనస్సు లో ఏం ఉందో తారక్ రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారో వేచి చూడాల్సి ఉంది.

తారక్ బుచ్చిబాబు కాంబో సినిమాపై రోజురోజుకు కన్ఫ్యూజన్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అటు బుచ్చిబాబు నుంచి లేదా ఇటు తారక్ నుంచి ఎలాంటి స్పష్టత లేదనేది నిర్వివాదాంశం. ఓవైపు బుచ్చిబాబు కూడా తారక్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. మొత్తాని కి తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ ల విషయంలో ఒకింత గందరగోళం నెలకొంది అనేది వాస్తవం. తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో ఒక్క సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా తారక్ కెరీర్ మారిపోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కెరీర్ పరంగా తారక్ మరింత ఉన్నత స్థానాలకు ఎదగాల ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Share post:

Latest