జేసీ ఫ్యామిలీకి లక్కీ ఛాన్స్!

ఏపీ రాజకీయాల్లో తిరుగులేని ఫ్యామిలీల్లో జేసీ ఫ్యామిలీ కూడా ఒకటి…రాజకీయంగా పెద్దగా ఓటములు ఎరగని కుటుంబం…మొదట నుంచి జేసీ దివాకర్ రెడ్డి సత్తా చాటుతూ వచ్చారు…తాడిపత్రిలో అదిరిపోయే విజయాలు అందుకున్నారు…అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2014లో రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ నష్టపోవడంతో జేసీ ఫ్యామిలీ టీడీపీలోకి వచ్చింది.

ఈ క్రమంలోనే జేడీ దివాకర్ రెడ్డి…అనంతపురం ఎంపీగా పోటీ చేసి గెలవగా, జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా జేసీ బ్రదర్స్ సత్తా చాటారు. కానీ 2019 ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ వారసులు మాత్రం సత్తా చాటలేకపోయారు. జగన్ వేవ్‌లో అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ తనయుడు పవన్ ఓడిపోగా, తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ తనయుడు అస్మిత్ పోటీ చేసి ఓడిపోయారు. అనంత విషయం వదిలేస్తే…తొలిసారి తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీకి ఓటమి ఎదురైంది.

ఎప్పుడైతే ఇక్కడ ఓటమి వచ్చిందో అప్పటినుంచి..జేసీ ఫ్యామిలీ దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టింది. అలాగే ప్రభాకర్, అస్మిత్‌లు మధ్యలో వాహనాల రిజిస్ట్రేషన్ కేసులో జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఇక ఇదంగా జగన్ కక్షపూరితంగా చేశారని చెప్పి…జేసీ ఫ్యామిలీ మరింత దూకుడుగా రాజకీయం చేసింది. అలాగే తాడిపత్రి మున్సిపాలిటీని జేసీ ప్రభాకర్ రెడ్డి గెలిపించుకున్నారు. ఇక మున్సిపాలిటీలో గెలుపుతో తాడిపత్రిలో మళ్ళీ జేసీ ఫ్యామిలీ హవా మొదలైందని చూపించారు.

ఇక ఇక్కడ నెక్స్ట్ ప్రభాకర్ పోటీ చేస్తారా లేక ఆయన వారసుడు అస్మిత్ పోటీ చేస్తారో తెలియదు గాని…జేసీ ఫ్యామిలీ నుంచి తాడిపత్రిలో ఎవరు పోటీ చేసిన గెలుపు ఖాయమే అన్నట్లు పరిస్తితి ఉంది. అటు అనంత ఎంపీగా మరోసారి పవన్ బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. అక్కడ పవన్‌కు గెలుపు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అనంత పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పుంజుకోవడంతో…ఈ సారి అనంత పార్లమెంట్‌లో జేసీ పవన్ సత్తా చాటేలా ఉన్నారు…మొత్తానికి ఈ సారి జేసీ ఫ్యామిలీకి లక్కీ ఛాన్స్ వచ్చేలా ఉంది.