కుప్పంకు జగన్…బాబుకు ఆహ్వానం.!

ఇటీవల కుప్పం నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో బాగా హైలైట్ అవుతుంది. ఈ మధ్య చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే…అక్కడ వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య ఎలాంటి రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ రచ్చ తగ్గకుండానే కుప్పం టూరుకు జగన్ వెళ్ళడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కుప్పం పర్యటనలో ఉన్నప్పుడు బాబు..దమ్ముంటే జగన్ కుప్పంకు రావాలని సవాల్ విసిరారు.

ఇదే క్రమంలో జగన్…కుప్పం టూరుకు రావడం జరుగుతుంది. ఈ నెల 22న కుప్పం వచ్చి..పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేయనున్నారు. అలాగే అక్కడ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. జగన్ టూర్‌ని సక్సెస్ చేసేందుకు వైసీపీ శ్రేణులు ఇప్పటినుచే పనిచేస్తున్నాయి. ఇదే సమయంలో సీఎం కుప్పంకు వస్తున్న నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేకు ఆహ్వానించాలి. అందుకే స్థానిక ఎమ్మెల్యే అయిన చంద్రబాబుకు ఆహ్వానం పంపుతారని తెలుస్తోంది. ఎలాగో చంద్రబాబు రారు. కాబట్టి ఆయన భయపడి రాలేదని వైసీపీ శ్రేణులు ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి.

అయితే గతంలో కుప్పం పేరు ఏదో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు మాత్రం వినిపించేది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పం పేరు రాజకీయంగా వినపడుతుంది. ఎప్పుడైతే కుప్పంని కూడా కైవసం చేసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారో..అప్పటినుంచి ఇక్కడ రచ్చ నడుస్తోంది…లోకల్ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది…కుప్పం మున్సిపాలిటీని గెలుచుకుంది.

అలాగే కుప్పం అసెంబ్లీని గెలుచుకుంటామని వైసీపీ నేతలు అంటున్నారు…మంత్రి పెద్దిరెడ్డి ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేసి పనిచేస్తున్నారు. వైసీపీ ఫోకస్ చేయడంతో..చంద్రబాబు కూడా కుప్పంలో పర్యటిస్తున్నారు..ఇటీవల కూడా మూడు రోజులు పర్యటించారు. అప్పుడు పెద్ద రచ్చ జరిగింది. బాబు పర్యటనని వైసీపీ అడ్డుకోవడానికి చూసింది..అన్నా క్యాంటిన్‌ని ధ్వంసం చేశారు. మరి ఇప్పుడు జగన్ టూర్‌ని టీడీపీ శ్రేణులు అడ్డుకోవడానికి చూస్తాయా? లేక పోలీసు బలగం ఎక్కువ ఉంటుంది కాబట్టి, సైలెంట్‌గా ఉండిపోతారో చూడాలి.