రాజధాని రిస్క్..జగన్ తగ్గించుకుంటారా?

నూటికి 95 శాతంపైనే హామీలు అమలు చేశాం…జనాలకు చాలా చేశాం..ఇంకా తమకు తిరుగులేదు..నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ప్రజలు తమకు మద్ధతుగా నిలుస్తారని..సంక్షేమమే తమని గెలిపిస్తుందనే ధీమా వైసీపీలో ఉంది. అవును నిజమే సంక్షేమ పథకాలని అద్భుతంగా అమలు చేశారు. మరి ప్రజలు కేవలం సంక్షేమం మాత్రమే చూసి ఓటేస్తారా? ఇంకా వేరే సమస్యలు, అభివృద్ధి, రాజధాని..ఇలా ఏ అంశాన్ని ప్రజలు పట్టించుకోరా? అంటే ప్రజలు అన్నీ పట్టించుకుంటారు…సమయం చూసి వారి తీర్పుని ఇస్తారు.

కాబట్టి వైసీపీ అన్నీ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి..ముఖ్యంగా రాజధాని విషయం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రాజధాని సమస్యలు లేదు…ఒక్క ఏపీలో తప్ప. సరే గత చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా పెట్టింది. దానికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా ఒప్పుకున్నారు.  కానీ 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక..మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మూడు రాజధానులు తీసుకొచ్చారు. కానీ దీనికి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. మూడు రాజధానులు ప్రకటించి మూడేళ్లు అవుతున్నా సరే..దీనిపై కదలిక లేదు.  గతంలో రెండుసార్లు బిల్లు  ప్రవేశపెట్టి ఆమోదించుకుని, ఓసారి ఉపసంహరించుకున్న ఈ బిల్లును మరోసారి మార్పులతో తిరిగి ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలుచేస్తోంది. ఇదే క్రమంలో అమరావతి కోసం అక్కడ రైతులు, ప్రజలు వెయ్యి రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు. వీరికి వైసీపీ తప్ప అన్నీ పార్టీల మద్ధతు ఉంది.

ఇదే క్రమంలో రాజధాని విషయంలో వైసీపీ వైఖరి తప్పు అని నిరూపించేందుకు ఇప్పటికే అమరావతి అరసవెల్లి పాదయాత్ర మొదలుపెట్టారు. ఉత్తరాంధ్ర మీదుగా జరగనున్న ఈ పాదయాత్ర ద్వారా..అక్కడ ప్రజల మద్ధతు కూడా పొందాలని అమరావతి రైతులు చూస్తున్నారు. అదే గాని జరిగితే వైసీపీకి డ్యామేజ్ తప్పదు. అందుకే ఎలాగైనా పాదయాత్రని అడ్డుకుంటామని వైసీపీ మంత్రులు అంటున్నారు. అలాగే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఎలాంటి తప్పులు లేకుండా కొత్తగా మూడు రాజధానుల బిల్లుని తీసుకొచ్చి, దాన్ని ఆమోదించుకుని మూడు రాజధానులు ఏర్పాటు దిశగా వెళ్తారని తెలుస్తోంది.

దీంతో అమరావతి గురించి చర్చ జరగదు…అలాగే మూడు రాజధానులు వస్తాయి. అయినా సరే రాజధాని విషయంలో వైసీపీకి రిస్క్ ఉంది..మళ్ళీ బిల్లులో ఏమన్నా తప్పులు ఉంటే న్యాయపరమైన చిక్కులు వస్తాయి. అలాగే ఎన్నికల ముందు మూడు రాజధానులు ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు నమ్మే అవకాశాలు తక్కువ ఉంటాయి. మొత్తానికి రాజధాని విషయంలో జగన్‌కు ఇబ్బందే.

Share post:

Latest