తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ మినహా ఏ యువ నాయకుడు కూడా దూకుడుగా పనిచేయకూడదు…యువ నేతలంతా లోకేష్ వెనుకే ఉండాలి. ఎవరైనా దూకుడుగా పనిచేస్తే వారికి బ్రేకులు తప్పదు. ఇది టీడీపీలో జరుగుతున్న తంతు అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి చెప్పాలంటే ఇందులో కూడా కాస్త వాస్తవాలే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో లోకేష్ కంటే ఎఫెక్టివ్ గా పనిచేసే యువ నేతలు ఉన్నారు. అలాగే బాగా మాట్లాడే నాయకులు ఉన్నారు.
కానీ వారిని మాత్రం టీడీపీలో హైలైట్ కానివ్వడం లేదనే ప్రచారం మాత్రం ఉంది. అలాగే గతంలో టీడీపీలో ఉండగా దేవినేని అవినాష్ తెలుగు యువత అధ్యక్షుడుగా పనిచేసేవారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయాక..ఏ నాయకుడు పెద్దగా బయటకు రాకపోయినా అవినాష్ మాత్రం…కార్యకర్తలకు భరోసా ఇస్తూ వచ్చారు. కాస్త దూకుడుగానే పనిచేస్తూ వచ్చారు. కానీ ఈయనకు సినినియర్లు బ్రేకులు వేసింతలు తెలుస్తోంది. లోకేష్‌ని దాటేస్తారని చెప్పి..అవినాష్‌కు బ్రేకులు వేశారని, అందుకే అవినాష్ టీడీపీని వదిలి..వైసీపీలోకి వెళ్లారనే టాక్ ఉంది.
అలాగే తెలుగు యువత పదవి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న పరిటాల శ్రీరామ్‌కు గాని, రామ్మోహన్ నాయుడుకు గాని ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ వారైతే లోకేష్‌ని డామినేట్ చేస్తారని చెప్పి, వారికి పదవులు ఇవ్వలేదని చర్చ నడిచింది. పెద్దగా ఎవరికి తెలియని శ్రీరామ్ చినబాబుకు పదవి ఇచ్చారు. ఇలా లోకేష్‌ని డామినేట్ చేసే యువనేతలని టీడీపీ ఎదగనివ్వలేదని టాక్ వచ్చింది.
ఇదే క్రమంలో ఇప్పుడు లోకేష్‌కు ఎక్కడ పోటీ వస్తారని చెప్పి బాలయ్య చిన్నల్లుడు భరత్‌ని కూడా తోక్కేయడానికి చూస్తున్నారని వైసీపీ మీడియాలో ప్రచారంలో జరుగుతుంది. లోకేష్ కంటే భరత్ చాలా బెటర్ అని, అందుకే ఆయన్ని తోక్కేయాలని చూస్తున్నారని, నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇవ్వకుండా చేయాలని చూస్తున్నారని కథనాలు వస్తున్నాయి. అయితే ఇదంతా వైసీపీ కథనమే. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.