సత్తెనపల్లి జనసేనకు వదులుతారా?

రాష్ట్రంలో ఇప్పుడుప్పుడే టీడీపీ గ్రాఫ్ పెరుగుతుంది…ఇటీవల వస్తున్న పలు సర్వేల్లో టీడీపీ పుంజుకుందని తెలుస్తోంది…ఇంకొంచెం కష్టపడితే నెక్స్ట్ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇలాంటి తరుణంలో చాలా నియోజకవర్గాల్లో సీటు కోసం నేతల మధ్య పోటీ పెరుగుతుంది. ఎవరికి వారు సీటు విషయంలో పోటీ పడుతున్నారు. అలాగే సెపరేట్‌గా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఇలా గ్రూపు రాజకీయాలు చేయడం వల్ల పార్టీకే ఇబ్బంది అయ్యేలా ఉంది.

ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తనేపల్లిలో కూడా టీడీపీ పరిస్తితి ఇబ్బందిగానే ఉంది. ఇక్కడ ఒకటి, రెండు కాదు…నాలుగైదు గ్రూపులు ఉన్నాయి. కోడెల శివప్రసాద్ ఉండుంటే ఇలాంటి గ్రూపులు పెద్దగా ఉండేవి కాదు…ఆయన చనిపోయాక సీటు కోసం కొందరు నేతలు రెడీ అయ్యారు. ఎలాగో కోడెల వారసుడు శివరాం..ఈ సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు.

అటు రాయపాటి రంగబాబు కూడా ఎప్పటినుంచో ఈ సీటుపై కన్నేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, తెలుగు యువత నేత మల్లి సైతం…ఇక్కడ పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు…అందరికీ క్లాస్ ఇచ్చారు…అందరూ నేతలు కలిసి పనిచేయాలని చెప్పారు. అయినా సరే తాజాగా ఎవరికి వారే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు.

దీనిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు..ఎవరు వ్యక్తిగతంగా కార్యక్రమాలు చేయొద్దని, పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే క్యాంటీన్కు సపోర్ట్ గా ఉండాలని చెప్పారు. ఇంత చెప్పిన అక్కడ టీడీపీ నేతలు మారే అవకాశాలు లేవు. అయితే అందరినీ కూర్చోబెట్టి..ఈ సీటు విషయం త్వరగా తెలిస్తే బెటర్ అని సత్తెనపల్లి కార్యకర్తలు అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకో మెలిక ఉందని తెలుస్తోంది. నెక్స్ట్ గాని జనసేనతో పొత్తు ఉంటే…ఏ తలనొప్పి లేకుండా ఈ సీటుని…ఆ పార్టీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అందుకే బాబు ఇక్కడ ఇంచార్జ్‌ని తేల్చలేదనే టాక్ కూడా ఉంది. మరి చూడాలి చివరికి సత్తనేపల్లి పంచాయితీ ఏం అవుతుందో.