మోక్షజ్ఞ జాతకలా వల్లే ఎంట్రీ ఆలస్యం అవుతోందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ వారసుడు సినీ ఎంట్రీ కోసం అభిమానుల సైతం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చాలా రోజుల నుండి ఈ ప్రశ్న ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంది. బాలకృష్ణ ఎవరైనా దర్శకుడు తో సినిమా తీసిన మాట్లాడిన కూడా ఆదర్శకుడితో మోక్షజ్ఞ సినిమా తీయబోతున్నారని వార్తలు ఇండస్ట్రీలో చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇక దీంతోపాటుగా మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అనే విషయంపై వారానికి ఒక వార్త వినిపిస్తూ ఉన్నది. అయితే తాజాగా మరొకసారి ఇప్పుడు ఒక సంచలన వార్త వినిపిస్తోంది వాటి గురించి చూద్దాం.

Nandamuri Mokshanga to debut in Aditya 369 sequel, announces father  Nandamuri Balakrishna | Entertainment News,The Indian Express
నందమూరి వారసుడు మోక్షజ్ఞ వెండితెరపై ఎంట్రీ గురించి అభిమానులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక దర్శకులుగా ఎవరో ఒకరి పేరు మాత్రం వినిపిస్తూనే ఉందని చెప్పవచ్చు. అయితే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఆలస్యానికి కారణం బాలకృష్ణ అనే అని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. బాలయ్య జాతకాలను బాగా ఎక్కువగా నమ్ముతారని.. ముహూర్తాలపై బాగా ఎక్కువగా నమ్మి తన సినిమాలని సైతం ఆ సమయంలోనే ప్రారంభిస్తూ ఉంటారు.

ఆ కారణాలతోనే మోక్షజ్ఞ 2023లో ఎంట్రీ చేయిస్తే బాగుంటుందని ఫిక్స్ అయినట్లుగా సమాచారం. దీంతో ఈ ఏడాది సినిమా ప్రవేశం గురించి ఎలాంటి వార్తలు ఉండవు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ముహూర్తాలు బాగున్నందువల్ల బాలకృష్ణ కొడుకు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ఏడాది ఆఖరులో అన్ని పనులు కూడా మొదలు పెడతారని సమాచారం. ఇక అంతే కాకుండా మోక్షజ్ఞ మరింత ఫిట్టుగా తయారయ్యేందుకు సిద్ధంగా ఉండబోతున్నట్లు టాక్. అయితే ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Share post:

Latest