బీజేపీతో బాబు..డ్యామేజ్ ఖాయమే..!

గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి చంద్రబాబులో మార్పు వచ్చిన విషయం తెలిసిందే..ముఖ్యంగా బీజేపీ నుంచి బయటకు వచ్చిన విషయంలో బాగా రియలైజ్ అయ్యారు. అందుకే మళ్ళీ బీజేపీకి దగ్గరయ్యేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అసలు ఏపీలో బీజేపీకి బలం లేదు కదా..అలాంటప్పుడు ఆ పార్టీతో బాబుకు పని ఏంటి అని అనుకోవచ్చు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి ఉంటే..కేంద్రం అండ..అలాగే వైసీపీ ఏమన్నా ఇబ్బంది పెట్టినా..కేంద్రం కాపాడుతుందనే ధీమా ఉంటుంది.

అందుకే అటు వైసీపీ అయిన, ఇటు టీడీపీ అయిన..బీజేపీతో కయ్యం పెట్టుకోవడం లేదు. గత ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ కయ్యం పెట్టుకోవడం వైసీపీకి బాగా కలిసొచ్చింది. అయితే ఇప్పుడు కయ్యం పెట్టుకోకుండా బీజేపీతో మళ్ళీ కలవాలని. అలాగే జగన్‌ని బీజేపీ నుంచి దూరం చేయాలని చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కేంద్రం మద్ధతు ఉంటే..రాష్ట్రంలో ఈజీగా అధికారంలోకి రావొచ్చు అని బాబు భావిస్తున్నారు.

అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది..జగన్ నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు. అలా పెట్టుకుని ఉంటే జగన్‌కు నష్టం జరిగేది..అలా కాకుద్న పరోక్షంగా బీజేపీతో కలిసి ఉంటున్నారు. అవసరం ఉన్నప్పుడు కేంద్రానికి తన మద్ధతు ఇస్తున్నారు..అలాగే రాష్ట్ర సమస్యలపై పెద్దగా పోరాటం చేయకుండా..తనకు ఎలాంటి ఇబ్బంది రాకుండా జగన్ చూసుకుంటున్నారు.

కానీ బాబు మాత్రం బీజేపీతో డైరక్ట్ గా పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అదే గాని జరిగితే టీడీపీకే నష్టం జరిగేలా ఉంది. ఇప్పటికే హోదాతో పాటు పలు విభజన హామీలని కేంద్రం అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రజలు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారు. పైగా ఇస్తామని చెప్పిన రైల్వే జోన్ కూడా డౌట్ గా ఉంది. ఇలాంటి పరిస్తితుల్లో బీజేపీతో నేరుగా కలిస్తే టీడీపీకి నష్టం. పరోక్షంగా బీజేపీ మద్ధతు తీసుకుంటే ఇబ్బంది లేదు గాని..నేరుగా కలిస్తే చిక్కులు తప్పవు.