పొన్నియన్ సెల్వన్: ఐశ్వర్యరాయ్‌ రోల్‌తో స్క్రీన్‌పై సెగలేనట!!

మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్-1పై భారత దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌కు సినీ ప్రేక్షకుల నుంచి అనూహ్య రీతిలో పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, ప్రకాష్ రాజ్, జయం రవి వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ మూవీ స్టోరీ కూడా అందరిలో ఆసక్తి రేపుతోంది. ఈ మూవీ కథ భారతదేశ గొప్ప సామ్రాజ్యమైన చోళ రాజ్యం చుట్టూ తిరుగుతుందని సమాచారం. రూ.500 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ మూవీ సినీ చరిత్రలో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ మూవీ ట్రైలర్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్‌ను చూసిన తర్వాత సినీ విమర్శకులు ఇవేమీ అంత కొత్తగా లేవని కామెంట్స్‌ చేశారు. అయితే ఒక విషయం మాత్రం వారందరినీ ఆకట్టుకుంది. అదే నందిని క్యారెక్టర్! ఈ పాత్రను ఐశ్వర్యరాయ్ చేసింది. ఈ పాత్రలో ఆమె అందం మరింత రెట్టింపయ్యింది. నందినిగా ఐశ్వర్య ఒక క్వీన్ లాగా కనిపించి అందరి కళ్లను తన వైపే తిప్పుకుంది. ట్రైలర్‌లో ఆమె లుక్‌ను చూసిన ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులయ్యారు. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలతో ప్రేక్షకుల హృదయాలను ఐశ్వర్య అమాంతం దోచేస్తుందట.

ట్రైలర్ లాంచ్ సందర్భంగా, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పొన్నియిన్ సెల్వన్-1లో నందిని రోల్ సినిమా మొత్తానికే హైలైట్ అవుతుందని అన్నారు. దాంతో నందిని రోల్‌పై హైప్ పెరిగిపోయింది. 1999 బ్లాక్‌బస్టర్‌ నరసింహలో రమ్యకృష్ణ నీలాంబరిగా చేసిన పాత్ర అనేది పొన్నియన్ సెల్వన్ నవలలోని నందిని పాత్ర ఆధారంగా రూపొందించినట్లు తెలిపారు. దాంతో ఈ పాత్ర ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఇంకా పెరిగిపోయింది. ఇకపోతే మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం మరో 3 వారాల్లో తమిళం, హిందీ, తెలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్‌ అవుతుంది.

Share post:

Latest