వైరల్ గా మారుతున్న బాలయ్య కుమారుడి ఫోటోలు.. చుస్తే వావ్ అనాల్సిందే..!!

నందమూరి నటసింహ బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఆయన అభిమానులు కూడా ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పటికే పలువురు డైరెక్టర్ల తో సైతం మోక్షజ్ఞ ఎంట్రీ చేయబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారికంగా ప్రకటన వెలుబడలేదు. గతంలో బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణ సినిమాలో నటించబోతున్నట్లు టాక్ వినిపించిన అది కేవలం అబద్ధం గానే మిగిలిపోయింది. అయితే మోక్షజ్ఞ సినిమాలలో ఎంట్రీనే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతగా ఎప్పుడూ కనిపించడు.Mokshagna's birthday: Movie lovers waiting for his mass moves | cinejosh.com

అయితే మోక్షజ్ఞ కు సంబంధించి పలు ఫొటోస్ అప్పుడప్పుడు చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. అయితే తాజాగా మోక్షజ్ఞ బర్తడే వేడుకలకు సంబంధించి కొన్ని ఫోటోలు నెట్ ఇంట వైరల్ గా మారుతున్నాయి. సెప్టెంబర్ ఆరవ తేదీన మోక్షజ్ఞ పుట్టినరోజు అంటే ఈరోజు. ఈ సందర్భంగా బాలయ్య ఇంట్లో మోక్షజ్ఞ బర్తడే వేడుకలను చాలా ఘనంగా నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగానే తన కుమారుడికి కేక్ కట్ చేయించి అనంతరం ఆ కేకుని తన కుమారుడికి తినిపిస్తూ ఉన్నట్లుగా ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. చాలాకాలం తర్వాత మోక్షజ్ఞ ఫోటోలను చూసిన నందమూరి అభిమానుల సైతం చాలా ఖుషి అవుతున్నారు.Mokshagna spotted at NBK107 sets - Cine Chit Chat

ఇక త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ పలు రకాలుగా కామెంట్లు వినిపిస్తున్నాయి . ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK -107 అనే టైటిల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది . ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇక మరొక డైరెక్టర్ అనిల్ రావిపూడి తో కూడా ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ కుమారుడు కి సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

Share post:

Latest