వారెవ్వా..అదే కనుక నిజమైతే..బాలయ్య చిరకాల కల నెరవేరిన్నట్లే..!?

నందమూరి నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన బాలకృష్ణ.. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ..ఇప్పటికి జనాలను అలరిస్తున్నారు .దాదాపు 106 సినిమాలు చేసిన నందమూరి బాలకృష్ణ త్వరలోనే 107వ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య 107వ సినిమాను తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తుంది . కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 60% కంప్లీట్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది . బాలయ్య అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమాకు క్రేజీ టైటిల్ ఫిక్స్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇవన్నీ పక్కనపడితే బాలయ్య సినిమాల అప్డేట్ కన్నా ఇప్పుడు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనే విషయంపై అభిమానులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నందమూరి నటవారసుడు చూడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ త్వరలోనే ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఫినిష్ చేసిన బాలయ్య.. ఈ సినిమా కోసం ఒక స్టార్ డైరెక్టర్ ను రంగంలోకి దింపినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అంతేకాదు ఈ సినిమా కోసం ఏకంగా కనీ విని ఎరుగని రేంజ్ లో 100 కోట్ల భారీ బడ్జెట్ ని ప్లాన్ చేస్తున్నాడట బాలయ్య.

అదే కనుక నిజమైతే ఇప్పటివరకు ఏ స్టార్ హీరో కానీ ఏ స్టార్ డాటర్ కానీ ఇంత భారీ బడ్జెట్ సినిమాతో ఇంట్రడ్యూస్ అయినా దాఖలాలు లేవు. దీంతో నందమూరి నట వారసుడు సరికొత్త చరిత్రను క్రియేట్ చేయబోతున్నాడు అంటూ నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మోక్షజ్ఞ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ను ట్రెండింగ్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ వార్తలో ఎంత నిజం ఉందో..? నందమూరి వారసుడు ఎలాంటి రికార్డు బద్దలు కొడతాడో..?

Share post:

Latest