“వాడితో నేను సినిమా చేయను రా బాబు”..దండం పెట్టేసిన మహేశ్ బాబు..!?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత అందంగా ఉంటాడో అంత మంచి మనసు . సంపాదించిన దాంతో సగానికి పైగా ప్రజాసేవ అంటూ ఖర్చు చేస్తున్న ఏకైక టాలీవుడ్ హీరో . అంతేకాదు తాను చేసిన సహాయాన్ని బయటకు రానివ్వకుండా పబ్లిసిటీ అంటే దూరంగా ప్రజాసేవకు దగ్గరగా ఉన్నటువంటి హీరో ఈ మహేష్ బాబు. అందుకే మహేష్ బాబు అంటే సినీ ప్రముఖులు కూడా ఇష్టపడతారు . ఇప్పటికే పలువురు పేద పిల్లలకి అనాధ పిల్లలకి తనకు చేతనైన సహాయం చేస్తూ.. రీల్లోనే కాదు రియల్ లైఫ్ హీరోగా కూడా మహేష్ బాబు మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు.

ఆయన లాస్ట్ నటించిన చిత్రం సర్కారి వారి పాట . ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . సూపర్ హిట్ గా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది . ఈ సినిమాలో మహేష్ బాబు నటన సరి కొత్తగా ఉందంటూ అభిమానులు సైతం ఆయనను మెచ్చుకున్నారు . అయితే ప్రజెంట్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో ఫ్యామిలీ డ్రామా సినిమాను చేయబోతున్నాడు. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో మరో సినిమా కమిట్ అయ్యాడు . కాగా మహేష్ బాబు ఏ డైరెక్టర్ తో అయినా సినిమా అంటే ముందు కథ విని ఆ తర్వాత నచ్చితేనే సైన్ చేస్తాడు .

కానీ తన కెరీర్లో ఫస్ట్ టైం మహేష్ బాబు ఆ డైరెక్టర్ కథ చెప్పడానికి ఇంటికి వస్తున్నాడు అని తెలియగానే ..వాడితో నేను సినిమా చేయను రా బాబు అంటూ దండం పెట్టేసాడట. అది కోపంగా కాదండి.. ఆయనకి డైరెక్టర్ తో అతని ఉన్న స్నేహం . ఆయన మరెవరో కాదు మెహర్ రమేష్ . ఆఫ్ కోర్స్ మెహర్ రమేష్ అంటే సినీ ఇండస్ట్రీలో అందరికీ ఒకటే పేరు ప్లాప్ డైరెక్టర్ . ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయినవే. మహేష్ బాబుతో కూడా బాబి అనే సినిమా తీసి అట్టర్ ఫ్లాప్ ని ఇచ్చాడు .

అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత మహేష్ బాబు మెహర్ రమేష్ ఒక స్టోరీ వినిపించడానికి రెడీ అయ్యారట . కానీ మహేష్ బాబు మెహర్ రమేష్ అంటేనే..” నీ తో సినిమా చేయను రా బాబు” అంటూ దండం పెట్టేసాడని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి . నిజానికి ఇప్పటికీ మెహర్ రమేష్ మహేష్ బాబు మీట్ అవుతూనే ఉంటారు. మాట్లాడుకుంటూనే ఉంటారు. కానీ, ఆయన డైరెక్షన్లో సినిమా అంటే మహేష్ బాబు కు ఏదో తెలియని భయం అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

Share post:

Latest