పడిన చోటే నిలబడటం అంటే ఇదే కాబోలు.. హీరోకు అరుదైన రికార్డ్..!

ఒకప్పుడు వీడు హీరో ఎంటన్న జనం నేడు తమిళనాట అయనకే నీరాజనాలు పలుకుతున్నారు. అభిమానుల అండతో అటు హాలీవుడ్ ఇటు బాలీవుడ్ లో తనదైన మార్క్ ను వేశాడు. భారీగా ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నాడు. సైలెంట్ హిట్ లతో దూసుకుపోతున్నాడు.. సినిమా షూటింగ్ లలో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఆయనకు ఓ అరుదైన రికార్డ్ దక్కింది. ట్విట్టర్ ఖాతాలో 11 మిలియన్ ఫాలోవర్స్ తో అందిరి హీరోలకంటే ముందంజలో ఉండి.. తమిళనాట నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు . దక్షిణాదిలో 12 మిలియన్ ఫాలోవర్స్ తో మహేష్ బాబు ముందజలో ఉండగా. ఇయన రెండోవ స్థానంలో నిలిచాడు.. ఆయన ఎవరో కాదండి తిరు మూవీతో సైలెంట్ హిట్ లతో దూసుకుపోతున్న తమిళ స్టార్ హీరో ధనుష్..

తన యాక్టింగ్ తో సినిమా రేంజ్ ను మార్చి.. సౌత్ ఇండియా నుండి బాలీవుడ్, హాలీవుడ్ స్థాయిలో ఎదిగి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్. ప్రస్తుతం అన్న సెల్వరాఘవన్ దర్శకత్వంలో నాన్ వరువెన్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇంకా బయటకు రాలేదు.

గ్రే మ్యాన్ ప్రాజెక్ట్ తో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ధనుష్ గ్రే మ్యాన్ పార్ట్ – 2 లో కూడా నటిస్తున్నట్లు సమాచారం. తెలుగులో కూడా ధనుష్ కు క్రేజ్ ఉంది. శేఖర్ కమ్ములతో సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏ జోనర్ లో నటించినా దుమ్ముదులిపే యాక్టింగ్ తో పేక్షకుల మన్ననలు పొందుతున్న ధనుష్.. ప్రస్తుతం ఆయన తిరు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం.

Share post:

Latest