అక్కినేని వారికీ కలిసిరాని మొదటి పెళ్లిళ్లు.అందరికి ఇదే గండం వుందా??

అక్కినేని ఫామిలీ అంటే అందమైన హీరోల కు అడ్డా. నాగార్జున,నాగ చైతన్య,అఖిల్ వరకు అందరు మన్మధులే.నాగార్జున గారు మంచి హీరో ,ప్రొడ్యూసర్ కూడా.నాగార్జున సినిమాల్లో నటించే రోజుల్లోనే నిర్మాత దగ్గుబాటి రామానాయుడు గారి కూతురు లక్ష్మి ని పెళ్లి చేసుకున్నారు.వీరికి నాగ చైతన్య పుట్టాక మనస్పర్థలు రావటం తో ఇద్దరు విడిపోయారు.తరవాత కొన్ని రోజులకి నాగార్జున హీరోయిన్ అమల ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వీరి సంతానమే అఖిల్.అయితే నాగార్జున కి టబు కి వున్న రిలేషన్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అయినా వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకుంటున్నారు.

ఇక నాగార్జున మొదటి సంతానం నాగచైతన్య.చైతు కూడా సినిమాల్లో నే నటిస్తున్నారు.చైతు మంచి నటుడు,తన పని తానుచేసుకునే మనస్తత్వం వున్నవాడు.చైతు,హీరోయిన్ సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వీరిద్దరూ చాల అన్యోన్యంగా ఉండేవారు.జంట అంటే చై,సామ్ ల జంటలా ఉండాలి అనేవారు అంత.అయితే ఏమైందో తెలీదు విడిపోతున్నామంటూ ప్రకటించి అభిమానులని షాక్ కి గురి చేసారు చై,సామ్.
ఇక అఖిల్,ఈయన కూడా సినిమాల్లోనే నటిస్తున్నారు.అఖిల్ కి ప్రముఖ వ్యాపారవేత్త GVK రెడ్డి మనవరాలు శ్రేయ భూపాల్ తో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరిగింది.అయితే అఖిల్ తన తండ్రి,అన్న ల కంటే కూడా చాల ఫాస్ట్.అఖిల్ పెళ్లి నిశ్చితార్థం తో నే ఆగిపోయింది.ఇప్పటికి అఖిల్ బాచిలర్ గ నే వున్నాడు..

వీళ్ళు ముగ్గురే కాదు వీళ్ళ ఫ్యామిలీ లో ఇంకా నాగార్జున మేనల్లుడు హీరో సుమంత్ కూడా ఇదే కోవలోకి వస్తారు.సుమంత్ కూడా హీరోయిన్ కీర్తి రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.కొద్దిరోజులకే వీళ్ళు కూడా విడాకులు తీసుకున్నారు.ఇక మరో అక్కినేని ఇంటి మేనల్లుడు సుశాంత్ అయితే పెళ్లి మాటే ఎత్తలేదు.నాగార్జున మేనకోడలు సుప్రియ.ఈమె పవన్ కళ్యాణ్ తో హీరోయిన్ గ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా లో నటించారు.ఈమె వైవాహిక జీవితం కూడా ఒక డిసాస్టర్ .మొత్తమ్ మీద అక్కినేని నాగేశ్వర్ రావు గారి ఇంట్లో వైవాహిక జీవితం లో మాత్రం ప్లాప్ లే ఎక్కువ కనిపిస్తున్నాయి.

Share post:

Latest