రాజ‌మౌళిపై ఇంత చెత్త రూమ‌ర్ క్రియేట్ చేశారా… క్లారిటీ ఇదే…!

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ కపూర్-అలియా భట్ ఇద్దరు కలిసి నటించిన యాక్షన్ అండ్ ఫాంటసీ సినిమా బ్రహ్మాస్త్ర మొదటి భాగం శివ. ఈ సినిమాను బాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ మరియు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లు కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదల ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఈనెలల 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలనే ఎప్పుడూ లేనంతగా ఈ సినిమాను రు. 410 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్లో అన్ని భాషల్లోనూ విడుదలైంది. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. విడుదలకు ముందు నుంచి ఉన్న భారీ అంచనాలతో ఈ సినిమాకి ఓపెనింగ్స్ భారీగానే వచ్చాయి. ఈ సినిమాని సౌత్ లో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించాడు.

Ranbir Kapoor New Movie Brahmastra Trailer

ఇందులో రాజమౌళి ప్రమోట్ చేసిన విధానం కూడా ఈ సినిమాకి ఓపెనింగ్స్ భారీగా రావటానికి ముఖ్యపాత్ర పోషించింది. ఈ కారణం వల్లే రాజమౌళి ఈ మూవీ టీంతో కలిసి ప్రమోషన్ లో చాలా చురుగ్గా పాల్గొన్నారు. ఇదే క్రమంలో రాజమౌళి ఈ సినిమాకి ఊహించని విధంగా హైప్‌ తీసుకొచ్చాడు. అయితే రాజమౌళి ఈ సినిమాకి ప్రమోట్ చేయడానికి ఏకంగా రు. 10 కోట్లు తీసుకున్నాడని ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ విషయంపై ఈ సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

ఇవన్నీ అబద్ధం రాజమౌళి కరణ్ జోహార్ తో ఉన్న అనుబంధం కారణంగా ఈ సినిమాకి ప్రమోటర్‌గా వ్యవహరించారని ఈ సినిమా యూనిట్ తెలిపింది. ఇలాంటి వార్తలు అన్ని కావాలనే మీడియా వాళ్ళు సృష్టిస్తున్నారని వాళ్ళపై ఘాటుగా ఫైర్ అయింది ఈ సినిమా యూనిట్.

Share post:

Latest