ఈ మూవీ చేయకుండా ఉంటే బాగుండు..అని రష్మిక అనుకున్న సినిమా ఏంటో తెలుసా..?

రష్మిక మందన.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పేరుకి కన్నడ బ్యూటీని అయిన తెలుగులో మంచి మంచి అవకాశాలు..అందుకుని సినీ కెరియర్లో తనకంటూ ..ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. రష్మిక మందన్న..ప్రజెంట్ టాలీవుడ్ ఇటు టాలీవుడ్ మధ్యలో బాలీవుడ్ మూడు భాషల్లోనూ సినిమాలు చేస్తూ ..మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.

తెలుగులో రెండు సినిమాలు, కోలీవుడ్ రెండు సినిమాలు, బాలీవుడ్ లో ఏడు సినిమాలు..ప్రస్తుతం ఇది రష్మిక మందన గ్రాఫ్ రికార్డ్. ఈ విధంగా చూసుకుంటే మరో నాలుగైదు ఏళ్లు రష్మిక మందన కాల్ షీట్లు ఫుల్ బిజీ అవుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాగా రష్మిక కెరియర్ లో కూడా ఫ్లాప్ సినిమాలు పడ్డాయి . తెలిసో తెలియకో కొన్ని కథలు ఒప్పుకొని తప్పు చేశానని ఆమె బాధపడింది. అందులో మరీ ముఖ్యంగా ఆమె చెప్పుకొచ్చింది “ఆడవాళ్లు మీకు జోహార్లు”.

రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా లో హీరోగా నటించిన శర్వానంద్.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయింది. నిజానికి స్క్రిప్ట్ చెప్పేటప్పుడు రష్మిక మందన కు డైరెక్టర్ ఒక్కలా చెప్పారని.. తెరకెక్కించాక మరోలా చేశారని.. మధ్యలో ఎడిటింగ్ లో కూడా మంచి మంచి సీన్స్ లేపేసారని.. ఆమె చెప్పుకు వచ్చిందట . అంతేకాదు తన కెరీర్లో ఇక పై అలాంటి మిస్టేక్ ఇంకోసారి చేయకూడదని నిర్ణయించుకుందట. మరి చూడాలి రష్మిక పేరు టాలీవుడ్ లో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో..?

Share post:

Latest