రెబల్ స్టార్ అనే బిరుదు కృష్ణంరాజుకి ఎలా వచ్చిందో తెలుసా..?

ప్రముఖ సీనియర్ నటుడిగా , రాజకీయవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణంరాజు కుటుంబం నుంచి వచ్చిన జమీందారు అయినా సరే చాలా సామాన్యుడిలా ఉంటారు..అందరితోనూ కలిసిపోవడం.. అందరిని ఆత్మీయులుగా పలకరించడం ఆయన గొప్పతనం.. కానీ ఆయనను చూస్తే మాత్రం చాలా మంది భయపడిపోతారు.. ఎందుకంటే చూడడానికి గంభీరంగా ఉండే ఆయన చూపులకు అలా కనిపించిన మనసు మాత్రం విన్నా అని చెప్పవచ్చు. ఇకపోతే ఈయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు.. ఇప్పటివరకు 183 పైగా చిత్రాలలో నటించిన కృష్ణంరాజు 1966 చిలక గోరింక అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

ఇక ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన ఈయన బెస్ట్ యాక్టర్ అవార్డులు, నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు .కృష్ణవేణి ,భక్త కన్నప్ప, అమరదీపం , సతీ సావిత్రి, కటకటాల రుద్రయ్య, బావ బామ్మర్ది ,మన ఊరి పాండవులు ఇలా ఎన్నో సినిమాలు ఆయన కెరియర్ లోనే బెస్ట్ సినిమాలు గా నిలిచాయి. ఇకపోతే ఆయనకు రెబెల్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది అంటే.. ఆయన అభిమానులే ఆయన సినిమాలు మెచ్చి , ముద్దుగా రెబల్ స్టార్ అని బిరుదును ఇచ్చారు ఇకపోతే ఆ బిరుదే ఇప్పుడు ప్రభాస్ కి కూడా వచ్చింది. ఇక తన పెదనాన్న నుంచే రెబల్ స్టార్ అనే బిరుదును ప్రభాస్ పొందారు..

అసలు విషయంలోకి వెళ్తే కృష్ణంరాజు తన సినిమాలలో కన్నెర్ర చేయడం.. రెబల్ గా మాట్లాడడమే ఇందుకు ముఖ్య కారణం .. ఇకపోతే ఈ విషయాన్ని కృష్ణంరాజు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. గంభీరమైన వాయిస్ ఉండడం తో నా అభిమానులు నాకు రెబల్ స్టార్ అనే బిరుదుని ఇచ్చారు అంటూ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. ఇకపోతే ఆయన ఈరోజు ఉదయం 3:25 గంటలకు ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Share post:

Latest