మెగా -154 సినిమా డిజిటల్ రైట్స్ ఎన్ని కొట్లో తెలుసా..?

జయాపజయాలతో సంబంధం లేకుండా మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక చిరంజీవి నటించిన గత చిత్రం ఆచార్య భారీ డిజాస్టర్ కావడంతో ఆయన తదుపరి సినిమాల పైన బిజినెస్ పైన ఎఫెక్ట్ పడుతుందని అందరూ భావించారు. కానీ తాజాగా చిరంజీవి నటించిన సినిమాల డిజిటల్ రైట్స్ తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక అక్టోబర్ 5వ తేదీన గాడ్ ఫాదర్ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమా ఓటీటి రైట్స్ నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.57 కోట్లకు దక్కించుకున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి.

Chiranjeevi act in Waltair veerayya/manatelangana.news
అయితే చిరంజీవి నటించబోయిన మరొక చిత్రం వాల్తేరు వీరయ్య ఈ సినిమా చిరంజీవికి 154వ సినిమా. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ రూ.50 కోట్ల రూపాయలకు ఓటిటి రైట్స్ సొంతం చేసుకున్నట్లుగా సమాచారం. మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న లూసిఫర్ చిత్రం డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ గా తెరకెక్కించడం జరిగింది.ఇందులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో సందడి చేయబోతున్నారు. ఇక వీరితోపాటు నయనతార ,సునీల్, పూరి జగన్నాథ్ సత్యదేవ్ తదితరులు నటిస్తున్నారు.

అయితే చిరంజీవి నటించకపోయిన 154వ సినిమాకి ఎలాంటి బాలీవుడ్ నటులు.. కానీ స్టార్స్ కానీ లేకపోయినా ఈ సినిమా ఓటీటి రైట్స్ రూ. 50 కోట్లకు అమ్ముడుపోవడంతో ఈ సినిమా రైట్స్ చాలా విశేషమని అభిమానుల సైతం భావిస్తూ ఉన్నారు. మరి ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఎక్కువగా చిరంజీవి ఈ మధ్యకాలంలో తన బ్యానర్ పైన సినిమాలను నిర్మిస్తూ ఉన్నారు.