జబర్దస్త్ సుధీర్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..!!

సుడిగాలి సుధీర్.. రామోజీ ఫిలిం సిటీ లో మెజీషియన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఆయన జబర్దస్త్ కార్యక్రమానికి ప్రముఖ కమెడియన్ వేణు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు . ఇక మొదట్లో స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసిన సుధీర్ ఆ తర్వాత కమెడియన్ గా మారి జబర్దస్త్ లో టీం లీడర్ గా మారాడు. ఇక జబర్దస్త్ కి ఈయనే దిక్కు అన్నట్టుగా మారిపోయాడు. ముఖ్యంగా సుడిగాలి సుదీర్ తన స్నేహితులైన ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను లతో చేసే కొన్ని వందల స్క్రిప్ట్లు ప్రేక్షకులను బాగా అలరించాయి. దాదాపు గత తొమ్మిది సంవత్సరాలుగా బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇక ఇటీవల హోస్ట్ గా చలామణి అవ్వడమే కాకుండా డాన్సర్ గా, హీరోగా కూడా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు. ఇక ఇటీవల నటించిన వాంటెడ్ పండుగాడు సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.Sudigali Sudheer - Wikipediaఇకపోతే 1987లో విజయవాడలో నాగమణి , ఆనంద్ భయ్యన్ అనే దంపతులకు జన్మించిన సుధీర్ కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇకపోతే ఈయన కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించాడు అనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక అసలు విషయంలోకి వెళితే బుల్లితెరపై షోల ద్వారా నెలకు 30 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు సుడిగాలి సుదీర్. మొన్నటి వరకు జబర్దస్త్ లో ఒక్కొక్క ఎపిసోడ్ కు రూ.2 లక్షల వరకు పారితోషకం అందుకున్న ఈయన , జబర్దస్త్ నుంచి బయటకు రావడంతో స్టార్ మా చానల్ వాళ్లు ప్రస్తుతం ఒక్కో ఎపిసోడ్ కు 4లక్షల రూపాయలను పారితోషకంగా అందిస్తున్నారు. ఇక మిగతా షోలలో చేస్తే రోజుకు 40 వేల రూపాయల వరకు తీసుకుంటున్నాడు.Sudigali Sudheer Biography: Family, Age, Movielist

ఇక సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాకు రూ.15 లక్షలు , త్రీ మంకీస్ సినిమాకు రూ.17 లక్షలు , ప్రస్తుతం వచ్చిన వాంటెడ్ పండుగాడు సినిమాకు రూ. 20 లక్షలు తీసుకున్నారని సమాచారం. ఇక మొత్తంగా పలు యాడ్ల ద్వారా కూడా సంపాదించిన సుధీర్ ఆస్తి మొత్తం సుమారుగా రూ. 8 కోట్లకు పైగా ఉంటుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.

Share post:

Latest