డిజాస్ట‌ర్ ‘ లైగ‌ర్‌ ‘ … పూరి ఎన్ని కోట్లు వెన‌క్కు ఇస్తున్నాడంటే….!

డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెర‌కెక్కిన సినిమా ‘లైగర్’. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ వచ్చి కంటెంట్ పరంగా ప్రేక్షకుల‌ను ఆకట్టుకోలేకపోయింది. అయితే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్‌పై మాత్రం ప్రశంసల వ‌ర్షం కురిశాయి. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన `లైగర్` సినిమా విడుదలై డిజాస్టర్ కావడంతో డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ కు మాత్రం మరోసారి కష్టాలు మొదలైనట్లు తెలుస్తోంది.

సినిమాను చూసిన ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా విషయంలో పూరీ జగన్నాథ్‌ను ఎక్కువుగా తప్పుబడుతున్నారు. ఎందుకంటే టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస హిట్స్‌తో క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరి.. మధ్యలో కొంతమంది మోసం చేయడంతో సంపాదించి ఆస్తి అంతా పొగొట్టుకున్నాడు.ఆ త‌రువాత రామ్ న‌టించిన‌ `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పూరి.. కెరీర్‌ను మళ్లీ రీస్టార్ట్ చేసాడు.

Puri Didn't Have Rs 50,000 Before 'Ismart Shankar': Reveals Charmme Kaur

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తనలో ఇంకా వాడి తగ్గలేదని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. అదే ఊపుతో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా లెవల్లో స్పోర్ట్స్ డ్రామా `లైగర్` మూవీనీ తెరకెక్కించాడు. కానీ ఫస్ట్ షో నుంచే ఈ సినిమా నెగిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. లైగ‌ర్‌ మొత్తం మీద రూ.60 కోట్లు మాత్రమే వసూళ్లు రాబట్టిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

లైగర్ పెద్ద డిజాస్టర్ కావడంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు తలలు పట్టుకుంటున్నారు. ఈ సినిమా కార‌ణంగా తాము న‌ష్ట‌పోయిన డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందేన‌ని ప్రొడ్యూసర్స్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ఆ కార‌ణంగా పూరి రూ.13 కోట్లు ఇస్తున్నాడ‌న్న వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి ఈ సినిమా నిర్మించార‌న్న సంగతి తెలిసిందే.

Share post:

Latest