ఈ సీన్ ను రాజమౌళి ఆ సినిమా నుండి కాపీ కొట్టాడా..? అమ్మ దొంగ నువ్వు ఖతర్నాక్ ఫేలోవి గురూ..!!

“ఆర్ ఆర్ ఆర్ ..రణం రౌద్రం రుధిరం” దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసింది. ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఓ సినిమాని తీయ్యగలరు..అభిమానులు యాక్సెప్ట్ చేస్తారు అనే పాయింట్ ని ప్రూవ్ చేసింది. జనరల్ గా సినీ ఇండస్ట్రీలో హీరోని పొగడుతూ మరో హీరోని తక్కువ చేస్తే అభిమానులకు కోపం వచ్చేస్తుంది . అలాంటిది ఇద్దరు బడా హీరోలు స్టార్ సన్స్ ను పెట్టి సినిమా తీయడం అంటే అది చాలా కష్టమైన విషయం. సినిమా తీయడం సంగతి పక్కన పెడితే అభిమానులను మెప్పించడం అసాధ్యం.

అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే రాజమౌళి పని . అందుకే అలాంటి ఓ సాహసానికి తెరతీసి సక్సెస్ ఫుల్ గా సినిమాను తెరకెక్కించి హిట్ కొట్టాడు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ఒకటి ఉంటుంది. పోలీస్ డ్యూటీ చేస్తున్న రామ్ చరణ్ అక్కడ ఉన్న ఉద్యమకారుల్ని అదుపులో పెట్టాలి.. అలా చరణ్ గాల్లోకి ఎగురుతూ లాఠి పట్టుకొని ఎంట్రీ షాట్ ఉంటుంది . ఇది థియేటర్స్ లో ఫస్ట్ టైం చూసిన జనాలకు గూస్ బంప్ తెప్పించాయి. టూ హైలెట్ గా మారింది సినిమాకే ఈ సీన్.

అయితే తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ గా మారింది. నిజానికి రామ్ చరణ్ ఇంట్రో సీన్ ఆల్రెడీ ఎప్పుడో ఊసరవెల్లి సినిమాలో ఎన్టీఆర్ చేసేసాడు. తమన్నా కోసం హెల్ప్ చేయడానికి వెళుతున్న తారక్ ని ఊసరవెల్లి సినిమాలో కొందరు రౌడీలు అడ్డుకుంటారు.. ఆ టైంలో పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఉన్న రాడ్ ని తీసుకుని గాల్లోకి ఎగురుతాడు. ఇక ఆ సీన్ కాపీ కొట్టినట్లు ఉంది ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ సీన్ చూస్తుంటే. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాజమౌళిని ఆడేసుకుంటున్నారు.” మామ ఈ సీన్ మా ఎన్టీఆర్ ఎప్పుడో చేసేసారు ..నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా.. అయ్యయ్యో” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలాంటి కామెంట్స్ రాజమౌళి పెద్దగా పట్టించుకోరని మనకు తెలిసిందే. కానీ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది.

 

Share post:

Latest