వరుస ఫ్లాప్‌లతో డీప్ షాక్‌లోకి వెళ్లిన ఆ యంగ్ హీరో..?

  1. కెరీర్ బిగినింగ్ లోనే సెన్సేషనల్ హిట్స్ సాధించి ఆ తరువాత వరుస ఫెయిల్యూర్స్‌ వస్తే కలిగే బాధ అంతా ఇంతా కాదు. మళ్లీ అలాంటి హిట్ ఎప్పుడొస్తుందా అని నిరాశతో వీరు మానసిక కుంగుబాటు గురవ్వటం ఖాయం. అయితే తాజాగా ఒక టాలీవుడ్ స్టార్ హీరో మాత్రం వరుస ఫ్లాప్‌లతో డీప్ షాక్‌లోకి వెళ్లిపోయాడు. కొన్నేళ్ల క్రితం ఈ హీరోకి భారీ సక్సెస్ వచ్చింది. ఆ తర్వాత అతడి పేరు భారత దేశ వ్యాప్తంగా మార్మోగింది. ఇప్పుడు ఆ హీరోకి దేశ వ్యాప్తంగా అభిమానులు కూడా ఉన్నారు. యంగ్ హీరోయిన్లకు ఈ హీరోపై క్రష్ కూడా ఉంది. అయితే ఎంత పాపులారిటీ ఉన్నా కూడా సినిమా స్టోరీలలో పస లేకపోవడంతో అవన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతాయి.

ఇటీవ‌ల రిలీజైన ఒక మూవీ ఊహించని రీతిలో ఫ్లాప్ కావడంతో ఈ యువ హీరో ఇప్పుడు తీవ్ర షాక్‌లో ఉన్నాడని సినీ సర్కిల్ లో టాక్ నడుస్తోంది. ఆ షాక్ వల్ల అతను ఇంటికే పరిమితమయ్యాడు. బయటకు రావడానికి కూడా అతనికి మనసు రావడం లేదట. ఇటీవలే ఒక అవార్డ్ ఈవెంట్ జరిగింది. ఈ అవార్డ్ ఫంక్షన్‌కు ప్రముఖ అతిథిగా ఆహ్వానం అందుకున్నాడు. అంతే కాదు ఓ అవార్డును కూడా గెలిచాడు. కానీ మొదట ఈ ఫంక్షన్‌కు వచ్చేందుకు అస్సలు ఆసక్తి చూపించలేదు.

నిజానికి ఈ కథానాయకుడు యాక్టింగ్ విషయానికొస్తే తన 100% డెడికేషన్ ఇస్తున్నాడు. కానీ ప్రేక్షకులకు నచ్చే మంచి కథను ఎంపిక చేసుకోలేక పోతున్నాడు. ఈ హీరో దర్శకులు చెప్పే స్క్రిప్ట్‌ని బాగా నమ్మి సినిమాల్లో వర్క్ చేస్తున్నాడు. ఆ నమ్మకమే అతడి కొంప ముంచుతుందని ఇప్పటికైనా రియలైజ్ అవుతాడో లేదో చూడాలి మరి. ఒకవేళ సరైన స్క్రిప్ట్ ఎంపిక చేసుకోవడంలో మళ్ళీ ఫెయిల్ అవుతే అతని కెరీర్‌కి ఎండ్ కార్డు పడటం ఖాయం.

Share post:

Latest