నీలి మీడియా: బాబు ఫస్ట్ టైమ్?

మొత్తానికైతే వయసు మీద పడుతున్న కొద్ది…చంద్రబాబు ఇంకా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు..2024 ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బాబు పనిచేస్తున్నారు. నిత్యం అధికార వైసీపీపై పోరాటం చేస్తూనే…ఎప్పటికప్పుడు పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. అటు టీడీపీ నేతలని సైతం ఫీల్డ్‌లో యాక్టివ్ గా ఉండేలా చూసుకుంటున్నారు. అలా అని సరిగ్గా పనిచేయకపోతే ఆ నేతలని తప్పించి..వేరే నేతలకు బాధ్యతలు అప్పగిస్తామని చెప్పేస్తున్నారు.

అంటే నెక్స్ట్ అధికారంలోకి రావడం అనేది బాబుకు ఎంత ముఖ్యమో బాగా తెలుసు. అందుకే అధికారం కోసం బాబు గట్టిగా పోరాడుతున్నారు. ఎప్పటికప్పుడు వైసీపీపై పోరాటం చేసే విషయంలో వ్యూహాలు మార్చుకుంటూ వెళుతున్నారు…అలాగే జగన్‌ని గద్దె దించడానికి పొత్తులకు కూడా రెడీ అవుతున్నారు. మొత్తానికైతే జగన్‌ని అధికారంలో నుంచి దించడమే బాబు లక్ష్యంగా ఉంది.

వైసీపీని అధికారానికి దూరం చేసే లక్ష్యంగానే తాజాగా టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో బాబు స్పీచ్ నడిచింది. సాధారణంగా బాబు ఇచ్చే స్పీచ్‌కు, తాజా స్పీచ్‌కు చాలా తేడా ఉంది. గతానికి భిన్నంగా బాబు మాట్లాడారు. అన్నికంటే ముఖ్యంగా బాబు ఎప్పుడు కూడా మీడియాని టార్గెట్ చేసి మాట్లాడలేదు. ఏదైనా ఉంటే పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం లాంటివి చేసేవారు గాని…జగన్ మాదిరిగా యెల్లో మీడియా ఏబీఎన్, టీవీ5, ఈటీవీ అని మాట్లాడినట్లు…బాబు వైసీపీ అనుకూల మీడియా గురించి మాట్లాడలేదు.

కానీ తాజాగా బాబు మీడియా గురించి మాట్లాడటం ఆశ్చర్యపరిచింది…సాక్షి ఎలాగో వైసీపీ మీడియా…ఆ మీడియాపై ఎప్పుడు విమర్శలు చేస్తారు..అయితే వైసీపీకి అనుకూలంగా ఉంటే వాటిపై విమర్శలు చేయలేదు. తాజాగా టీవీ9, ఎన్‌టి‌వి నీలి మీడియా అంటూ ఫైర్ అయ్యారు. అవి ప్రజల కోసం పోరాడుతున్న టీడీపీపై బురద జల్లుతున్నాయని, వైసీపీ తప్పు చేస్తున్నా సరే..అండగా ఉంటున్నాయని ఫైర్ అయ్యారు. ఈ నీలి మీడియాని బాయ్‌కాట్ చేయాలని టీడీపీ నేతలకు చెప్పారు. ఏదేమైనా గాని రాష్ట్రంలో వైసీపీ-టీడీపీ అనుకూలంగా మీడియా సంస్థలు చీలిపోయాయి.

Share post:

Latest